ఫస్ట్ నైట్ వేధింపులు: శాడిస్ట్ భర్త రాజేష్‌కు నపుంసక పరీక్షలు! మగతనం లేదని తేలితే

Posted By:
Subscribe to Oneindia Telugu
  Potency Test For Rajesh : సంసార సుఖానికి పనికిరాడని తెలిస్తే ?

  చిత్తూరు: శాడిస్ట్ భర్త రాజేష్‌కు (26) పొటెన్సీ టెస్ట్ (నపుంసక పరీక్షలు) చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు మూడో అదనపు జిల్లా కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. కోర్టు అనుమతితో ఆయనకు పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.

  చేతకానివాళ్లకు పెళ్లెందుకు: 'శాడిస్ట్ మొగుడు'పై నన్నపనేని, విచారణలో రాజేష్ ఆసక్తికర విషయాలు

  రాజేష్‌‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఇప్పటికే పోలీసులు తెలిపారు. నూతన వధువు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

   నపుంస పరీక్షలు

  నపుంస పరీక్షలు

  ఫొటెన్సీ టెస్టులో రాజేష్ సంసార సుఖానికి పనికిరాడని తెలిస్తే మరిన్ని అతనికి మరిన్ని చిక్కులు వస్తాయి. సంసారానికి పనికి రానని తెలిసి పెళ్లి చేసుకోవడమే కాకుండా, తొలిరాత్రి భార్యకు నరకం చూపించినందుకు అతనిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు కానున్నాయి.

   మగతనం లేదని తేలితే

  మగతనం లేదని తేలితే

  కోర్టు అనుమతి తీసుకుని రాజేష్‌కు ఈ పరీక్షలు నిర్వహిస్తామని, అతనికి మగతనం లేదని తేలితే ఐపీసీలోని మరికొన్ని సెక్షన్లను అతనిపై జోడిస్తామని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.

   పూర్తిస్థాయిలో విచారణ

  పూర్తిస్థాయిలో విచారణ

  శైలజపై రాజేష్ దాడి విషయంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. నిందితుడు వి కోట మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మరోవైపు రాజేష్ పైన కేసు నమోదు కావడంతో సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రకటించారు.

   మెరుగుపడిన శైలజ ఆరోగ్యం

  మెరుగుపడిన శైలజ ఆరోగ్యం

  మరోవైపు, రాజేష్ చేతిలో చావు దెబ్బలు తిన్న శైలజ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆమెను త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Police thinking to Potency test for Rajesh, who beats wife at first night in Chittoor Distict on Friday Night.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి