వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులివెందులకే నీళ్లిచ్చాను, జగన్ అజ్ఞాని.. కేసీఆర్‌‌ మంచోడా? ఏపీని ముంచేస్తే?.. చంద్రబాబు సంచలనం..

|
Google Oneindia TeluguNews

''మాట్లాడితే వైఎస్ కుటుంబం గొప్పంటారు. నేను పట్టుపట్టి తీసుకొచ్చేదాకా పులివెందులకు నీళ్లు గతిలేవు. రాజకీయంగా మేం లాభపడ్డామా లేదా అనేది పక్కనపెడితే అక్కడి ప్రజల నీటి అవసరాలను తీర్చామన్న సంతృప్తిమాత్రం దక్కింది. గడిచిన ఐదేళ్లలో అన్నీ కలిపి 60కిపైగా ప్రాజెక్టులు చేపట్టాం. అసలు పోతిరెడ్డిపాడును నిర్మించిందే మేము. అలాంటిది నన్నే ప్రశ్నిస్తారా? తెలంగాణ ప్రాజెక్టులతో ఏపీ పాకిస్తాన్ లా మారుతోందన్న జగన్.. అధికారంలోకి రాగానే తెలంగాణకు అమ్ముడుపోయాడు. కేసీఆర్ ఏమైనా మంచోడా? రేప్పొద్దున ఏపీని ముంచేస్తే ఎవరు బాధ్యులు? ఈ జగన్ అజ్ఞానానికి రాష్ట్ర ప్రజలు బలైపోవాలా?'' అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 ఏపీ-తెలంగాణ జగడం: ఊహించని ట్విస్ట్.. వైసీపీ విజయసాయిపై టీడీజీపీకి ఫిర్యాదు.. చంద్రబాబు భారీ స్కెచ్. ఏపీ-తెలంగాణ జగడం: ఊహించని ట్విస్ట్.. వైసీపీ విజయసాయిపై టీడీజీపీకి ఫిర్యాదు.. చంద్రబాబు భారీ స్కెచ్.

జూమ్ కాన్ఫరెన్స్..

జూమ్ కాన్ఫరెన్స్..

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, దాని నియంత్రణలో సర్కారు వైఫల్యం, విద్యుత్ చార్జిల పెంపు, అక్రమ అరెస్టులు, పోతిరెడ్డిపాడు వివాదం.. తదితర అంశాలపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు బుధవారం జూమ్ యాప్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించారు. నీటి వాటాలు, ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు చంద్రబాబు బదులిచ్చారు. కేసీఆర్ లాగా వ్యక్తిగత దూషణలు చేయబోనంటూ వివరణ ఇచ్చారు..

కేసీఆర్ చెడ్డవాడా?

కేసీఆర్ చెడ్డవాడా?


‘‘నాడు వైఎస్సార్ కేటాయించిన కాంట్రాక్టులు, ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానిని కూడా నేను రద్దు చేయలేదు. ఎందుకంటే న్యాయపరమైన చిక్కులు, పనుల్లో ఆలస్యం తలెత్తుతాయని నాకు తెలుసు. కానీ ఈ అజ్ఞాని జగన్ అధికారంలోకి వస్తూనే కాంట్రాక్టులు, పీపీఏలను రద్దు చేశాడు. దాంతో ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుతోపాటు అన్ని పనులూ నిలిచిపోయాయి. గతేడాది వర్షాలు బాగా కురిసినా.. సీకు నీళ్లు తరలించకుండా.. కృష్ణ నీటితో నా ఇంటిని ముంచేయాలని చూశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి పోతిరెడ్డిపాడు విస్తరణ పేరుతో డ్రామాలు చేస్తున్నాడు. సీఎం హోదాలో తెలంగాణకు వెళ్లి ప్రాజెక్టుల్న ఆశీర్వదించి, ఇవాళ కేసీఆర్ పై యుద్ధం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడు. కేసీఆర్ మంచోడా? చెడ్డోడా? అనే చర్చకు నేను పోవడం లేదు. కానీ సొంత రాష్ట్రం నష్టపోవదన్న ఇంటెన్షన్‌తో రేప్పొద్దున ఏపీని ముంచితే దిక్కెవరు? దీనికి జగన్ దగ్గర సమాధానం ఉందా?''అని చంద్రబాబు ప్రశ్నించారు.

జగన్ రెడ్‌జోన్‌లో లేడా?

జగన్ రెడ్‌జోన్‌లో లేడా?


తాను హైదరాబాద్ లో ఉంటున్నానని విషయాన్ని వైసీపీ నేతలు పదే పదే ప్రస్తావించడంపై చంద్రబాబు ఫైరయ్యారు. అవును, నేను హైదరాబాద్ ఇంట్లో నుంచి బయటికి కదలడంలేదు.. మరి జగన్, ఆయన పార్టీ వాళ్లు బయట తిరుగుతున్నారా? సీఎం క్యాంప్ ఆఫీస్ ఉన్న ఏరియా రెడ్ జోన్ లో ఉంది. ఇందుకాయన సిగ్గుపడాలి. కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టమంటే.. సహజీవనం చేయాలంటాడు. అంటే, అందరికీ వైరస్ సోకాలని జగన్ కోరుకుంటున్నాడా? జాగ్రత్తలు తీసుకోలేరా? ఇక జనం ప్రాణాలు గాలికొదిలేసినట్లేనా?''అని వాపోయారు. మొన్న నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ దగ్గర్నుంచి నిన్న రంగనాయకమ్మ వరకు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అందరిపైనా జగన్ ఉక్కుపాదం మోపుతున్నారని చంద్రబాబు గర్హించారు.

3 నెలల కరెంటు బిల్లులు రద్దు..

3 నెలల కరెంటు బిల్లులు రద్దు..

గుంటూరులోని సంపత్‌ నగర్‌ లో గుడిసెలో ఉండే ఓ వ్యక్తికి రెండు నెలల్లో రూ.3000 బిల్లు వచ్చిందని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బాధితులు కోకొల్లలుగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తూనే పీపీఏలను రద్దు చేయడంతో రోడ్డున పడ్డ రంగాల్లో విద్యుత్ కూడా ఒకటని, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకే కొత్త శ్లాబుల విధానం తీసుకొచ్చి, జనం జేబులకు చిల్లులు పెడుతున్నారని విమర్శించారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు కాబట్టి రాష్ట్రంలో 3 నెలల పాటు కరెంట్‌ బిల్లులు రద్దు చేయాలని సీఎంను ఆయన డిమాండ్‌ చేశారు. ఫ్యాన్‌కి ఓటేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్నినవారంతా ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ వేసుకోలేని పరిస్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు.

English summary
tdp chief chandrababu slams both ap and telangana chief ministers on pothireddypadu issue. he demands waive on electricity charges for three months in ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X