కాబోయే సిఎం అంటూ స్లోగన్స్: పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన కామెంట్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాటమరాయుడు ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో అన్యాపదేశంగానైనా ఆయన రాజకీయాల ప్రసక్తి వచ్చింది. పవన్ కల్యాణ్ మాట్లాడే సమయంలో అభిమానులు కాబోయే సిఎం అంటూ నినాదాలు చేశారు.. దానికి పవన్ కల్యాణ్ స్పందించారు.

ఏ పనైనా నిజాయితీగా చేస్తా

ఏ పనైనా నిజాయితీగా చేస్తా

సినిమాలను తాను నిజాయితీతో చేశానని, ఏ పనైనా నిజాయితీతో చేస్తానని అంటూ భవిష్యత్తులో ఎన్ని బాధ్యతలు పెట్టినా నిజాయితీతో చేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే అధికారం అంతిమ లక్ష్యం కాదని, ప్రజాసేవనే ముఖ్యమని ఆయన అన్నారు.

నా బిడ్డలే కాదు. అందరి బిడ్డలు బాగుండాలి

నా బిడ్డలే కాదు. అందరి బిడ్డలు బాగుండాలి

అది జరిగిందా మంచిది, జరగలేదా మరీ మంచిది అని కాబోయే సిఎం నినాదాలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ అన్నారు. నీ బిడ్డలూ నా బిడ్డలు అని కాదు, అందరి బిడ్డలూ బాగుండాలని ఆయన అన్నారు. తాను జయాపజయాలను సమానంగా చూస్తానని ఆయన సినిమాలను ఉద్దేశించే అన్నప్పటికీ ఆయన రాజకీయ భవిష్యత్తును ఉద్దేశించినవిగానే ఉన్నాయని అంటున్నారు.

ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని

ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని

వేడుకల్లో మాట్లాడిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా పరోక్షంగా పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడారు. ఎవరో ఒకరు వచ్చి న్యాయం చేస్తాడని తన వైపు చూస్తుంటారని, అది చూసినప్పుడు తనకు బాధేస్తుందని, ఇంకా ఎవరో ఒకరు వచ్చి న్యాయం చేయాల్సిన స్థితిలో ప్రజలున్నారని పవన్ కల్యాణ్ అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు.

మీకు దగ్గరయ్యేలా

మీకు దగ్గరయ్యేలా

సినిమాల ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా పవన్ కల్యాణ్ మీకు దగ్గర కావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆ ఇతర మార్గాలు అనే దాన్ని ఆయన పవన్ కల్యాణ్ రాజకీయాలను ఉద్దేశించే అన్నారని అర్థమవుతోంది.

కాటమరాయుడు టైటిల్ అలా.

కాటమరాయుడు టైటిల్ అలా.

కాటమరాయుడు టైటిల్ పెట్టినప్పుడు తనకు నచ్చడానికి కారణం అది తన సినిమా అత్తారింటికి దారేదిలో ఉందని చెప్పారు. అనంతపురం జిల్లాలోని కదిరి నర్సింహుడు ఆ పాటలో వస్తాడని, అది తన సినిమాలో ఉందని, ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఉందని పవన్ కల్యాణ్ అనంతపురం సభలో అన్నారని ఆయన గుర్తు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Power star and Jana Sena chief Pawan Kalyan indirectly spoke about his politics said that power will not be ultimate goal.
Please Wait while comments are loading...