నేను దూకుడుగా వ్యవహరించలేదు: జేసీపై ప్రభాకర్ చౌదరి, రంగంలోకి బాబు

తాను ఎక్కడా దూకుడుగా వ్యవహరించలేదని, జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యులు అని, ఆయన అందరనీ కలుపుకొని పోవాలని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మంగళవారం అన్నారు.

విజయవాడ: తాను ఎక్కడా దూకుడుగా వ్యవహరించలేదని, జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యులు అని, ఆయన అందరనీ కలుపుకొని పోవాలని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మంగళవారం అన్నారు. ఆయన మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు.

ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి తీరు పైన ఆయన చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అనంతపురంలో తన ఆధిపత్యాన్ని తగ్గించేందుకు జేసీ కుట్ర పన్నుతున్నారని, ఆయన పైన చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే, చంద్రబాబుకు వివరణ కూడా ఇచ్చుకున్నారు.

prabhakar choudhary

ముగ్గురు సభ్యులతో కమిటీ

జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరిల మధ్య విభేదాల నేపథ్యంలో చంద్రబాబు రంగంలోకి దిగారు. వీరి మధ్య విభేదాలను, అలాగే వివాదానికి కారణమైన అభివృద్ధి పనుల విషయమై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేశారని తెలుస్తోంది. మంత్రులు నారాయణ, శిద్ధా రాఘవ రావు, ఎమ్మెల్సీ షరీఫ్‌లతో కమిటీ వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+