ప్రభాస్ విషయంలో వేణుస్వామి చెప్పిందే జరుగుతోందా?
ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తోన్న ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రం విడుదలై మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం జోరుమీదుంది. ఈ సినిమా మూడోరోజు కూడా రూ.100 కోట్లు వసూలు చేసింది. మూడు రోజులకు ఆదిపురుష్ రూ.340 కోట్లు వసూలు చేసింది. టాక్ విషయంలో సినిమా నిలబడుతుందా? లేదా? అనే అనుమానం వ్యక్తమైనప్పటికీ అభిమానులు మాత్రం ప్రభాస్ వైపు నిలబడటంతో భారీ కలెక్షన్ల దిశగా ఈ సినిమా సాగుతోంది.
గొప్ప హిట్ అవదన్నారు
'ఆదిపురుష్' సినిమా విడుదలకు ముందే సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణుస్వామి దానిపై జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. అందరూ అనుకుంటున్నట్లుగా 'ఆదిపురుష్' హిట్ అవదని, యావరేజ్ గా నిలుస్తుందని చెప్పారు. బాహుబలి రేంజ్ ఏమాత్రం ఊహించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రామాయణం కథ అయినప్పటికీ, హిందూ మతానికి సంబంధించిన సినిమా అయినప్పటికీ సినిమా మాత్రం గొప్ప హిట్ అవదన్నారు.

అదే జరుగుతోందా?
ఆదిపురుష్ విడుదలైన తర్వాత పరిణామాలను పరిశీలిస్తే వేణుస్వామి చెప్పిందే నిజమవబోతోందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. సినిమాకు యునానిమస్ గా హిట్ అనే టాక్ రాలేదు. రివ్యూలు కూడా అటు హిట్ అని, ఇటు ఫ్లాప్ అని చెప్పలేకపోయాయి. ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు? అనేది సెకండ్ మ్యాటరని, సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఏమయ్యాయని వేణుస్వామి ప్రశ్నించారు. సినిమా బీభత్సంగా హిట్ అయ్యే రేంజ్ లో ఉండదన్నారు. ఇదంతా ప్రభాస్ జాతకాన్ని బట్టి ఉందన్నారు.

స్వేచ్ఛ ఎక్కువైంది..
విజువల్ గ్రాండియర్ గా సినిమా నిలవబోతోందనే నమ్మకాన్ని ప్రభాస్ అభిమానులతోపాటు ఆదిపురుష్ సినిమా యూనిట్ కూడా పెట్టుకుంది. అయితే ప్రభాస్ ఇచ్చిన అవకాశాన్ని దర్శకుడు ఓంరౌత్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడని, రామాయాణం కథ విషయంలో సినిమాటిక్ పరంగా స్వేచ్ఛను చాలా ఎక్కువగా తీసుకున్నాడని, ప్రజలు పూర్తిగా ఈ సినిమాను ఆమోదించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేణుస్వామి చెప్పినట్లే సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అది రామాయణం కథ కాకుండా వేరే కథ ఏదన్నా అయితే 'ఆదిపురుష్' డిజాస్టర్ గా నిలిచేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications