మార్చి 31లోపు ఈ పథకంలో చేరితే నెలకు రూ.10వేలు!
మనలో చాలామంది కొంత నగదు పెట్టుబడిగా పెడతాం.. లేదంటే డిపాజిట్ చేస్తాం.. అవి భద్రంగా ఉండాలి.. మా నెలవారీ ఖర్చులకు సరిపడేంత వస్తే చాలు అని కోరుకునేవారే ఎక్కువ. ఇలా కోరుకోవడంలో తప్పులేదు. బ్యాంకుల కంటే పోస్టాఫీస్ లోనే అనేక పథకాలున్నాయి. బ్యాంకుల మీద వాటిల్లోని పథకాల్లోనే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటోంది. ఎటువంటి రిస్క్ లేకుండా నెలనెలా రాబడి కోరుకునేవారికి ప్రధానమంత్రి వయ వందన యోజన బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఈ పథకంలో చేరడానికి మార్చి 31 చివరి తేదీ.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ప్రధానమంత్రి వయన వందన యోజన పథకం కేవలం 60 సంవత్సరాల వయసు కలిగిన సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2020లో ఈ పథకాన్ని ఆవిష్కరించారు. దీంట్లో చేరడంవల్ల సీనియర్ సిటిజన్స్‌కు 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. గరిష్టంగా ఈ స్కీమ్ కింద 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకోవచ్చు. 7.4 శాతం రేటు ప్రకారం చూస్తే.. రూ.15 లక్షలకు ఏడాదికి రూ. 1.1 లక్షల వడ్డీ ఆదాయం వస్తుంది.

ఈ పాలసీ టర్మ్ పది సంవత్సరాలు. ప్రతి ఏడాది మీకు రూ. 1.1 లక్షలు వస్తూనే ఉంటాయి. ఈ పథకంలో చేరాలని భావించే వారు కనీసం రూ. 1,56,658 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎల్ ఐసీ లెక్కల ప్రకారం చూస్తే ఈ పథకంలో చేరడం వల్ల కనీసం నెలకు వెయ్యి రూపాయల పింఛను పొందొచ్చు. ఏడాదికి రూ. 12 వేలు వస్తాయి. గరిష్టంగా చూస్తే.. నెలకు రూ. 9,250 పింఛను వస్తుంది. సంవత్సరానికి రూ. 1.1 లక్షలు లభిస్తాయి. మనం ఎంతైతే పెట్టుబడిగా పెడతామో ఆ ప్రాతిపదికన వడ్డీ వస్తుంది. పింఛను మొత్తాన్ని నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాది చొప్పున కూడా పొందొచ్చు.

మనకు నచ్చిన విధంగా ఎంపిక చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. స్కీమ్ గడువు ముగిసిన తర్వాత మీరు డిపాజిట్ చేసిన మొత్తాన్నితిరిగి వెనక్కి చెల్లిస్తారు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో చేరి రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే మొత్తం రూ.30 లక్షలపై సంవత్సరానికి రూ. 2,22,000 వడ్డీ పొందొచ్చు. అంటే నెలకు దాదాపు రూ. 18,500 వస్తాయి.












Click it and Unblock the Notifications