వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుకును కాదని పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు సీఎం చేయగలడా?- కొంచెం బుర్ర వాడు: కేఏ పాల్

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడితో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ సమావేశమైన ఉదంతం- రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రోజులు గడుస్తున్నప్పటికీ- ఈ భేటీకి సంబంధించిన ప్రకంపనలు ఇంకా తగ్గట్లేదు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంపై వరుసగా విమర్శలు సంధించారు. చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీపై ప్రతిపక్ష పార్టీల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరికి జనసేనతో పొత్తులో సాగుతున్న బీజేపీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోలేదు.

కొలీజియంలో మేమూ ఉంటాం..: సీజేఐకి కేంద్ర ప్రభుత్వం లేఖకొలీజియంలో మేమూ ఉంటాం..: సీజేఐకి కేంద్ర ప్రభుత్వం లేఖ

 ఎన్నికల నేపథ్యంలో..

ఎన్నికల నేపథ్యంలో..

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కల్యాణ్-చంద్రబాబు భేటీ కావడం.. పొత్తులపై చర్చించారంటూ వార్తలు రావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగుదేశం- జనసేన పార్టీ మధ్య అధికారిక పొత్తు ప్రకటనలు, సీట్ల పంపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి అప్పట్లో. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన 30 అసెంబ్లీ, మూడు నుంచి నుంచి అయిదు లోక్ సభ స్థానాలను అడుగుతోందని.. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను చంద్రబాబుకు పంపించే అవకాశాలు ఉన్నాయనీ వార్తలొచ్చాయి.

కేఏ పాల్ ఫైర్..

కేఏ పాల్ ఫైర్..

ఈ పరిణామాలపై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి పెదవి విప్పారు. పవన్ కల్యాణ్ పై ఘాటు విమర్శలు సంధించారు. ఇదివరకు కూడా ఆయన పవన్ కల్యాణ్, చంద్రబాబుపై పలు ఆరోపణలు చేశారు. కాపు సామాజిక వర్గం పేరు చెప్పి, అప్పుడు ప్రజారాజ్యాన్ని, ఇప్పుడు జనసేనను అమ్మేస్తోన్నారని కేఏ పాల్ మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం పార్టీ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్- ఈ డీల్ ను సెట్ చేశారని ఆరోపించారు.

నారా లోకేష్ ను కాదని..

నారా లోకేష్ ను కాదని..

ఇవ్వాళ కేఏ పాల్ మళ్లీ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని పవన్ కల్యాణ్ గెలుస్తాడని తాను అనుకోవట్లేదని తేల్చి చెప్పారు. గెలిచినా గానీ పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ముఖ్యమంత్రిని చేస్తాడని భావించడంలో అర్థం లేదని స్పష్టం చేశారు.

ప్రజలను తప్పు పడితే ఎలా..

ప్రజలను తప్పు పడితే ఎలా..

తన ఓటమికి ప్రజలే కారణమంటూ పవన్ కల్యాణ్ ఇదివరకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద నిర్వహించిన యువ శక్తి సభలో చేసిన వ్యాఖ్యలను కేఏ పాల్ మరోసారి ప్రస్తావించారు. ప్రజలను తప్పు పట్టడం అవివేకమని చెప్పారు. ప్రజలు తనకు ఓటు వేయట్లేదని, ఎన్నికల్లో ఓడిస్తున్నారనే కారణంతో తాను చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నానని పవన్ కల్యాణ్ ఈ సభ ద్వారా తేటతెల్లం చేశారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చెయ్యాలనే కండిషన్ తో..

ముఖ్యమంత్రి చెయ్యాలనే కండిషన్ తో..

తనను ముఖ్యమంత్రిని చెయ్యాలనే కండిషన్ తో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటానని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని తప్పుపట్టారు కేఏ పాల్. పదవి కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఇస్తామంటే వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నట్టేనా అని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేయకపోయినా.. చంద్రబాబు తనను ముఖ్యమంత్రిని చేస్తాడని పవన్ పరోక్షంగా అంగీకరించినట్టయిందని పేర్కొన్నారు.

లోకేష్ ను కాదని..

లోకేష్ ను కాదని..

తన కొడుకు లోకేష్ ను కాదని పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయగలడా? అని సూటిగా కేఏ పాల్ సూటిగా ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడానికే పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోన్నాడని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీలో చేరడమే పవన్ చేసిన పెద్ద తప్పు అని అన్నారు. కనీస జ్ఞానం ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు తెలివి తేటలను ఇచ్చాడని, దాని వాడాలని కేఏ పాల్.. పవన్ కల్యాణ్ కు సూచించారు.

English summary
Praja Shanti Party Chief KA Paul criticizes Jana Sena Chief Pawan Kalyan over the alliance with TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X