ఈ అధిక మాసంలో వచ్చే అపూర్వమైన ఏకాదశి..

హిందూ ధర్మంలో అధికమాసం లేదా పురుషోత్తమ మాసంలో వచ్చే పద్మిని ఏకాదశి వ్రతానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి, అధికమాసం రెండూ శ్రీ మహావిష్ణువుకు అంకితం కావడంతో దీని మాహాత్మ్యం మరింత రెట్టింపు అవుతుంది. దీనిని పురుషోత్తమ ఏకాదశి లేదా మాలమాసి ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ వ్రతం ఎప్పుడు, ఎలా ఆచరించాలి, ధనవంతులు కావడానికి మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ద్రిక్ పంచాంగం ప్రకారం.. ఏకాదశి తిథి ఈ నెల 26న తెల్లవారు జామున 5:10 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు 6:21 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయాతిథి ప్రామాణికం కాబట్టి, పద్మిని ఏకాదశి వ్రతాన్ని మే 27న ఆచరించాలి.

Unlock Wealth and Blessings with Padmini Ekadashi Mahavishnu Devotion During Adhika Masa Jyotisha

పద్మిని ఏకాదశి పూజా ముహూర్తాలు:

పూజకు బ్రహ్మ ముహూర్తం వేకువ జామున 4:03 నుండి 4:44 గంటల వరకు ఉంది. సర్వార్థ సిద్ధి యోగం తెల్లవారు జామున 5:25 నుండి 5:56 నిమిషాల వరకు ఉంటుంది. సాయంత్రం పూజకు శుభ సమయం 7:12 నుండి రాత్రి 8:13 గంటల వరకు ఉంటుంది.

పద్మిని ఏకాదశి వ్రత పారాయణం

28వ తేదీన పద్మిని ఏకాదశి వ్రత పారాయణం చేయాలి. పారాయణకు శుభ సమయం తెల్లవారు జామున 5:25 నుండి ఉదయం 7:56 గంటల వరకు. ద్వాదశి తిథి ఉదయం 7:56 గంటలకు ముగుస్తుంది కాబట్టి ఆ లోపు పారాయణం పూర్తి చేయడం ఉత్తమం.

పద్మిని ఏకాదశి పూజా విధానం

పద్మినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించదలిచిన వారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. విష్ణుమూర్తిని స్మరిస్తూ వ్రత సంకల్పాన్ని తీసుకోవాలి. పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేసి, విష్ణుదేవుని విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్టించాలి. నెయ్యి లేదా నూనె దీపం వెలిగించి పూజ ప్రారంభించాలి.

విష్ణుమూర్తికి నీరు, పసుపు పూలు, పండ్లు, తులసి దళాలు సమర్పించాలి. పూజ సమయంలో విష్ణు సహస్రనామం, "ఓం నమో భగవతే వాసుదేవాయ" మంత్రాన్ని జపించాలి. రోజు మొత్తం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకొని, విష్ణువు ధ్యానాన్ని కొనసాగించాలి.

పద్మిని ఏకాదశి నాడు ధన లాభం కోసం కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం రావి చెట్టుకు నీటిని సమర్పించండి. రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని నమ్మకం. దీపం, జలం సమర్పించడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు దక్షిణావర్త శంఖంలో గంగాజలం నింపి అభిషేకం చేయండి. దీనివల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది.

అంతేకాకుండా శ్రీ సూక్తం పఠించడం అత్యంత శ్రేష్ఠమని పండితులు తెలియజేస్తున్నారు. ఇది ఐశ్వర్యం వృద్ధికి దోహదపడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పద్మిని ఏకాదశి రోజున భగవంతుడైన శ్రీ మహావిష్ణువుకు కుంకుమపువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ ఆచారం సకల శుభాలను ప్రసాదిస్తుందని, భక్తులు తమ మనసులోని ఆశయాలను పొందగలరని ప్రతీతి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+