2024లో సీఎంగా లోకేష్: చంద్రబాబుతో పవన్ రూ.1,000 కోట్ల డీల్: కేఏ పాల్
అమరావతి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని కలుసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు పవన్ కల్యాణ్. కుప్పం పర్యటనలో పోలీసులు ఆయనను అడ్డుకున్న నేపథ్యంలో పరామర్శించారు. కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా తీశారు. ఏకాంతంగా వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి.

ఎన్నికల నేపథ్యంలో..
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కల్యాణ్-చంద్రబాబు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు విజయవాడ నొవాటెల్ హోటల్ లో చంద్రబాబు స్వయంగా పవన్ కల్యాణ్ ను కలుసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇది కాస్తా తెలుగుదేశం- జనసేన పార్టీల మధ్య పొత్తులకు కారణమౌతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆ దిశగా పవన్ కల్యాణ్ ఓ అడుగు ముందుకు వేశారని, భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు తప్పకపోవచ్చనీ అంటున్నారు.

పాతిక సీట్లపై క్లారిటీ..
చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ నేపథ్యంలో తెలుగుదేశం- జనసేన పార్టీ మధ్య అధికారిక ప్రకటనలు, సీట్ల పంపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. ఈ దిశగా త్వరలోనే ఈ రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయనీ చెబుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన 30 అసెంబ్లీ, అయిదు నుంచి ఎనిమిది లోక్ సభ స్థానాలను అడుగుతోందని.. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను చంద్రబాబుకు పంపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

కేఏ పాల్ ఫైర్..
ఈ పరిణామాలపై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కల్యాణ్ యువజన విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారని, అప్పట్లో చంద్రబాబును రాజకీయ ప్రత్యర్థిగా భావించారని గుర్తు చేశారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి 1,500 కోట్ల రూపాయలకు కాంగ్రెస్ కు అమ్మేశారని, ఇప్పుడు పవన్ కల్యాణ్ 1,000 కోట్ల రూపాయలకు జనసేనను టీడీపీకి తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు.

కాపుల పేర్లు చెప్పి..
కాపు సామాజిక వర్గం పేరు చెప్పి, అప్పుడు ప్రజారాజ్యాన్ని, ఇప్పడు జనసేనను అమ్మేస్తోన్నారని కేఏ పాల్ మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం పార్టీ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్- ఈ డీల్ ను సెట్ చేశారని ఆరోపించారు. నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయడానికి నాదెండ్ల మనోహర్.. చంద్రబాబుతో 1,000 కోట్ల రూపాయలతో డీల్ ను పవన్ కల్యాణ్ కు కుదిర్చారని విమర్శించారు. పవన్ కల్యాణ్ కు సంక్రాంతి కానుక అందిందని ఎద్దేవా చేశారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ?












Click it and Unblock the Notifications