
కేఏ పాల్ నామినేషన్లో ట్విస్ట్.. అవి లేకుండానే దాఖలు..!
నరసాపురం : ప్రజా శాంతి పార్టీ అధినేత కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ నామినేషన్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ సెగ్మెంట్ నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆస్తులు, అప్పులు, కేసులకు సంబంధించి వివరాలు వెల్లడించాల్సిన అఫిడవిట్ ను నామినేషన్ పత్రాలతో జత చేయలేదని తెలుస్తోంది.
హైదరాబాద్
ఎంపీ
అభ్యర్థులుగా
ఓవైసీ
బ్రదర్స్
ఒక్కరు
కాదు
..
ఇద్దరు
కాదు
..
ముగ్గురు..
!
క్యాబాత్
హై

నామినేషన్ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు.. కేఏ పాల్ ప్రాథమిక వివరాలతో కూడిన దరఖాస్తు మాత్రమే అందజేసినట్లు సమాచారం. అంతేకాదు బ్యాంకు ఖాతాతో పాటు ఇతర వివరాలకు సంబంధించి ఖాళీ పత్రాలు అందించినట్లు తెలుస్తోంది. అయితే నామినేషన్ల గడువు 25వ తేదీతో ముగుస్తున్నందున అంతలోపు పెండింగ్ పెట్టిన పత్రాలు, వివరాలు అందించాలని కేఏ పాల్ కు రిటర్నింగ్ అధికారులు సూచించినట్లు సమాచారం.