కిరణ్ లేఖను హోంకు పంపిన ప్రణబ్, చదవలేదన్న డిగ్గీ

న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం రాజ్యాంగపరమైన మర్యాదలు పాటించడం లేదంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హోంశాఖకు పంపినట్లుగా రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రాసిన లేఖలోని అంశాలు, అందులో లేవనెత్తిన సందేహాలను పరిశీలించాలని రాష్ట్రపతి హోంశాఖను కోరినట్లుగా సమాచారం.

రాష్ట్రపతికి వచ్చిన లేఖలను సంబంధిత శాఖలకు పంపడం సాధారణమేనని వెల్లడించాయి. రాష్ట్రపతి వచ్చే నెల 5వ తేదిన పోలీస్ అకాడమీలో జరిగే పాసింగ్ ఔట్ పరేడ్ కోసం హైదరాబాదులో ఉండనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆయనతో విభజన అంశంపై చర్చించే అవకాశం ఉంది.

Pranab Mukherjee

కాగా, విభజనపై రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, ఏకపక్షంగా ముందుకు వెళ్లరాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.

దీనిపై వివరణ కోరుతూ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు రాష్ట్రపతి లేఖ రాశారు. ఇక ముఖ్యమంత్రి లేఖ రాసిన అంశంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా అసంతృప్తితో ఉన్నారట. సిఎం సృష్టించిన తలనొప్పితో ఢిల్లీ పెద్దలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారంటున్నారు. కిరణ్‌పై వేటు తప్పదనే నిర్ణయానికి వచ్చారట.

నేనింకా చదవలేదు: దిగ్విజయ

ముఖ్యమంత్రి లేఖ పైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను అడగ్గా తాను ఇంకా ఆ లేఖను చూడలేదని, చెక్ చేసుకొని తర్వాత మాట్లాడుతానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+