కేసీఆర్! మీరు ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు, ఇక మారండి: ప్రత్యేక హోదా పోరాట సమితి లేఖ

విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాట సమితి లేఖ రాసింది. ఆయన విశాఖపట్నం పర్యటన నేపథ్యయంలో ఈ లేఖను విడుదల చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలకు కేసీఆర్ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

నీటిపారుదల ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం, నిరుద్యోగ సమస్య విషయంలో ఏపీకి వ్యతిరేకంగా ప్రవర్తించడం నవ్యాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. తెలుగు ప్రజల మనోభావాలు గుర్తించి ఇక నుంచి రాష్ట్ర మేలుకు కేసీఆర్‌ సహకరించాలని కోరుతూ ఈ లేఖను విడుదల చేశారు.

Pratyeka Hoda Porata Samithi letter to KCR

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేసీఆర్‌ను హోదా పోరాట సమితి లేఖలో కోరింది. ఇప్పటి వరకు కేసీఆర్‌ అన్ని సందర్భాల్లో ఏపీ పట్ల తన వ్యతిరేకత చాటుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులు, నిరుద్యోగ సమస్య, అమరావతి నిర్మాణంలో అడ్డుపుల్లలు వేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. ఈ విధానాలకు స్వస్తి పలికి ఆంధ్ర ప్రజలకు మేలుచేసే చర్యలకు ఒడిగట్టాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+