చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో ప్రవీణ్ గల్లా మృతి: ఆత్మహత్య చేసుకున్నాడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, ఫుల్లెట్రన్ విద్యార్థి ప్రవీణ్ గల్లా ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు గానీ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ప్రవీణ్ మృతదేహం ఈనెల 9న న్యూపోర్ట్ బీచ్‌లో తేలియాడుతూ కనిపించింది.

మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన అధికారులు ఆయన మృతికి గల కారణాలను ధ్రువీకరించుకోలేకపోతున్నారు. అయితే చదువుతోపాటు, స్టూడెంట్ ఎఫ్-1 వీసా విషయంలో అతను నిరంతరం ఒత్తిడితో ఉండేవాడని చెబుతున్నారు. ప్రవీణ్ కనిపించడం లేదంటూ ఫిబ్రవరి 2న అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిబ్రవరి 1న ప్రవీణ్ ఉబెర్ క్యాబ్‌లో ఫుల్లెట్రన్ నుంచి క్యాంపస్‌కు వెళ్లాడు. అనంతరం ఆయన న్యూపోర్ట్ బీచ్ ప్రాంతానికి వెళ్లినట్టు మొబైల్‌కు ‘చెక్‌ఇన్' నోటిఫికేషన్ వచ్చిందని అతని స్నేహితుడు తెలిపాడు. అయితే అధికారులు మాత్రం ప్రవీణ్ ఫుల్లెట్రన్ నుంచి న్యూపోర్ట్ బీచ్‌కు బస్సులో వచ్చినట్టు అనుమానిస్తున్నారు.

Praveen Galla commited suicide in USA?

కాగా, ఫిబ్రవరి 9వ తేదీన సముద్రంలో తేలియాడుతున్న ప్రవీణ్ మృతదేహాన్ని లైఫ్‌గార్డ్స్ గుర్తించారు. స్టూడెంట్ వీసా విషయంలో ప్రవీణ్ ఒత్తిడికి గురైనట్టు కెప్టెన్ స్కాట్ విల్లీ అన్నారు. తనకు తెలిసినంత వరకు ప్రవీణ్ తన చదువు విషయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యేవాడని, దీనికి తోడు స్టూడెంట్ వీసా విషయంలో ఆందోళనతో ఉండేవాడని విల్లీ అన్నారు.

స్నేహితులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రవీణ్ తెలివైన విద్యార్థి అని యూనివర్సిటీ ప్రెసిడెంట్ మిల్డెర్డ్ గార్కియా క్యాంపస్ కమ్యూనిటీకి రాసిన ఈమెయిల్‌లో అన్నారు. అతని మరణానికి దారి తీసిన పరిస్థితులపై ఆరాతీస్తున్నామని, అతను కనిపించకుండా పోయాడే విషయం తమకూ తెలిసిందని, అతని కుటుంబానికి యూనివర్సిటీ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

English summary
A student from Chittoor district in Andhra Pradesh Praveen Galla may commited suicide in USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X