100కోట్ల హిందువులకు మంచి జరగాలి: శ్రీవారికి తొగాడియా ప్రార్థన
చిత్తూరు: దేశంలో హిందువుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని, గణాంకాల్లో తేలిందని, ఇదే పరిస్థితి ఇలాగే ఉంటే హిందువుల మనుగడ కష్టమని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయన మంగళవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వంద కోట్ల మంది హిందువులకు మంచి జరగాలని తాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించానని చెప్పారు.

దేశంలో అందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తుల పైన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అనవసర భారం మోపుతోందన్నారు. ఐసిస్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అన్ని మతాలు ఒక్కటి కావాలన్నారు.
కాగా, ఇటీవల కేంద్రం నివేదికలో హిందువుల పెరుగుదల శాతం తగ్గినట్లుగా తేలిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా హిందువులు... భారత దేశంలో 80 శాతం కంటే తగ్గారు. గతంలో ఎప్పుడు ఎనభై శాతం కంటే తగ్గలేదు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications