ప్రేయసి గర్భం దాల్చడంతో చంపి పూడ్చి పెట్టిన ప్రియుడు !
ఏలూరు :పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని నడిపూడి వద్ద గోదావరి లంకలో ఇసుకలో పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాం ఆచూకీని పోలీసులు గుర్తించారు.ప్రియుడే ఆమెను చంపి హాత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
రెండు రోజుల క్రితం పెనుగొండ మండలంలోని నడిపూడి వద్ద గోదావరి లంకలో ఇసుకలో పూడ్చిపెట్టిన శవాన్ని కుక్కలు పిక్కుతింటుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఈ సమాచారం ఆదారంగా పోలీసులు ఇసుకలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని సోమవారం నాడు వెలికి తీసి పోస్టుమార్టమ్ నిర్వహించారు.

మృతదేహం వద్దే పూడ్చిపెట్టిన సెల్ పోణ్ , ఫోటోలు పోలీసులకు కీలకమైన ఆధారాలను అందించాయి.పెనుమంట్ర మండలం ఎస్ .ఇంద్రపర్రు గ్రామానికి చెందిన జోగి సీతగా మృతురాలిని పోలీసులు గుర్తించారు..సీతకు సుమారు 20 ఏళ్ళుంటాయి. ఐదేళ్ళ క్రితం తండ్రి కన్నయ్య చనిపోయాడు.సోదరుడు ఉపాధి కోసం ఏడాది క్రితం దుబాయి వెళ్ళాడు.తల్లి లక్ష్మితో కలిసి ఉండేది సీత. తణుకులోని ఓ ఫ్యాక్టరీలో ఆమె పనిచేసేది.
ఐదు మాసాల నుండి ఆమె పనిమాని ఇ:టి వద్దే ఉంటుంది. అక్టోబర్ 22వ, తేది నుండి ఆమె ఆచూకీ కన్పించడంలేదు. ఆమె సమాచారం కోసం ప్రయత్నించినా పలితం లేకపోయింది.సీత గర్భవతి అనే విషయం తల్లికి తెలియదు.సీత మరణానికి సంబందించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.గర్భవతిని చేసిన ప్రియుడే ఆమెను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications