దారుణం: గర్భిణీపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్
హైదరాబాద్: కామాంధుల కోరికకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఆఖరికి గర్భిణిని కూడా వదలడం లేదు. గర్భిణీపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడులో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఇంట్లోనే ఒంటరిగా ఉన్న గర్భిణీపై నలుగురు యువతులు సామూహిక అత్యాచారం చేసి, అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ అత్యాచార ఘటన్ని నిందితులు వీడియో తీశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఇద్దరు మైనర్ యువకులు ఉన్నారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications