భర్త ఇష్టం లేదంటూ టెక్కీ భార్య ఆత్మహత్య, సెల్పీ వీడియో రికార్డ్

Posted By:
Subscribe to Oneindia Telugu

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఓ గర్భిణీ ఆత్మహత్య చేసుకొంది. ఆత్మహత్య చేసుకొనే ముందు బాధితురాలు మౌనిక సెల్పీ వీడియో తీసుకొంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.అయితే భర్త ఇష్టం లేదంటూ ఆమె తన సెల్పీ వీడియోలో పేర్కొందని పోలీసులు చెబుతున్నారు.

4 ఏళ్ళ క్రితం మౌనికకకు సాప్ట్‌వేర్ ఇంజనీర్‌తో వివాహమైంది. తిరుమల అపార్ట్‌మెంట్‌లో మౌనిక కుటుంబం నివాసం ఉంటుంది. మౌనిక ఆత్మహత్యకు ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్త అంటే ఇష్టం లేదంటూ వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేసిందని పోలీసులు చెబుతున్నారు.

Pregnant woman suicide in west godavari district

ఆత్మహత్య చేసుకొనే ముందు మౌనిక సెల్పీ వీడియో రికార్డ్ చేసింది. సారీ అమ్మ అంటూ ఆ వీడియోలో తన తల్లికి క్షమాపణలు చెప్పింది. వివాహ సమయంలో అత్తింటికి ఇచ్చిన బంగారు ఆభరణాలతో పాటు ప్రతి వస్తువును తీసుకోవాలని ఆ వీడియోలో మౌనిక తల్లిని కోరింది.అయితే మౌనిక ఆత్మహత్యకు ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pregnant woman Mounika suicide at Tadepallygudem in west godavari district on Monday.Before suicide she was selfie video recorded about her suicide.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి