Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు

ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజనకు బీజం పడింది. మున్సిపల్ కార్పొరేషన్లు మొదలుకుని వార్డుల వరకు పునర్విభజన చోటు చేసుకోనుంది. వాటి రూపం సమూలంగా మారిపోనుంది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డులు 23 నుంచి 52కు పెరుగుతాయి. కార్పొరేషన్లలో 60 నుంచి 120 వరకు డివిజన్లు ఉంటాయి. చివరి జనాభా లెక్కల ప్రాతిపదికన వార్డుల విభజన ఉంటుంది.

కొత్త నిబంధనల ప్రకారం జనాభా ప్రాతిపదికన డివిజన్ల సంఖ్యను నిర్ణయించారు. రెండు లక్షలలోపు జనాభా ఉంటే ఇకపై 60 మంది వార్డు సభ్యులు ఉంటారు. రెండులక్షల నుంచి మూడు లక్షల వరకు జనాభా ఉంటే 62 మంది, జనసంఖ్య 10 లక్షల వరకు ఉంటే 66 నుంచి 76 వరకు సభ్యులు ఉంటారు. 15 లక్షలు అంత కంటే ఎక్కువ జనాభా ఉన్న పెద్ద కార్పొరేషన్లకు గరిష్ఠంగా 120 మంది సభ్యులు ప్రాతినిథ్యాన్ని వహిస్తారు.

Preparations Underway for Ward reorganization in AP Municipal Corporations Municipalities and ULBs

దీని ప్రకారం చూస్తే ఒక మున్సిపాలిటీలో రెండున్నర లక్షల జనాభా ఉందనుకుంటే వాటి సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 50 వార్డులకు అదనంగా మరో 12 చేరుతాయి. అంటే మొత్తం వార్డుల సంఖ్య 62కు పెరుగుతుంది. లక్షకుపైగా జనాభా ఉండే మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న 37వార్డుల సంఖ్య 48కి పెరుగుతాయి. లక్ష వరకు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 36 వార్డులు 48 కి చేరుతాయి.

ఈ నిబంధనలు అమలులో ప్రభుత్వం కొన్ని షరతులను సైతం విధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేని, లోటు బడ్జెట్ లో ఉన్న స్థానిక సంస్థలు తమ నిధులను 16వ ఆర్థిక సంఘం నుండి తీసుకోవచ్చు. లేదా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో పాటు ఇతర పరిపాలనా ఖర్చులకు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లించకూడదు. అలాగే ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికైన ప్రతినిధుల గౌరవ వేతనాలను కూడా పెంచకూడదు.

కాగా- ఆరు నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అదే సమయంలో ఈ పునర్విభజన వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎన్నికలతో పాటు సమాంతరంగా పునర్విభజన ప్రక్రియను అధికారులు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని వార్డుల సంఖ్య పెంచాలని నిర్ణయించినట్లు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. దీనికి సంబంధించిన సర్వే మొదలైందని, అది పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్తామని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+