భగ్గుమంటున్న ఆళ్లగడ్డ? ఇద్దరి మధ్య ఆర్థిక వివాదాలు?
గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డకు ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు.
రాజకీయ ప్రత్యర్థుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటుండేది. అటువంటి నియోజకవర్గంలో ప్రత్యర్థుల మధ్య కాకుండా ఒకే పార్టీలో ప్రత్యర్థులుగా మారినవారి మధ్య వాతావరణం వేడెక్కింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

ఆళ్లగడ్డ, నంద్యాల అడుగుతున్న అఖిలప్రియ
గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డకు ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉంటుందా? లేదా? అనే విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం స్పష్టత ఇవ్వలేదు. నివేదికలన్నీ ఆమెకు వ్యతిరేకంగా ఉండటమే కాకుండా ఇటీవల వివాదాస్పద పనుల్లో తలదూర్చడం కూడా మరో కారణం. నంద్యాల కూడా కావాలని, తన సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పోటీచేస్తాడంటూ అఖిలప్రియ అధిష్టానంపై ఒత్తిడి తెస్తోంది. ఈ తరుణంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంపై దివంగత భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఆళ్లగడ్డ కేటాయించాలంటూ అధిష్టానాన్ని కోరడంతో ఒక్కసారిగా ఆళ్లగడ్డలో రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి.

బొండా ఉమతో సుబ్బారెడ్డికి వియ్యం
ఏవీ సుబ్బారెడ్డికి తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమతో వియ్యం కుదిరింది. దీంతో బోండా ఉమ ఆళ్లగడ్డలో తన బావకు అనుకూలంగా, వచ్చే ఎన్నికల్లో పోటీచేయించేలా చక్రం తిప్పుతున్నారు. అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారంటూ ఏవీ సుబ్బారెడ్డి ఇటీవలే ప్రకటించారు. పార్టీ అధిష్టానం నుంచి ఏదైనా హామీ లభించిందా? లేదంటే అఖిలప్రియను డిఫెన్స్ లో పడేసేందుకు అలా ప్రకటించారా? అని రాజకీయవర్గాల్లో సందేహం వ్యక్తమవుతోంది. అయితే బొండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డి చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.

ఇద్దరి మధ్య ఆర్థిక వివాదాలు
చంద్రబాబునాయుడు తనకు అవకాశం ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తానని, 35 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రకటించారు. భూమా నాగిరెడ్డి జీవించి ఉన్నప్పుడు ఆయనకు కుడిభుజంగా ఏవీ సుబ్బారెడ్డి వ్యవహరించేవారు. అఖిలప్రియ తరం వచ్చేసరికి ఇద్దరి మధ్య అంతరం పెరిగింది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డ వేయకుండానే భగ్గుమంటోంది. కొన్నాళ్ల క్రితం ఏవీ సుబ్బారెడ్డి హత్యకు అఖిలప్రియ భర్త భార్గవ్ కుట్ర పన్నారనే కేసు సంచలనంగా మారింది. అంతేకాకుండా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదం నెలకొందనే చర్చ నడుస్తోంది. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియకు అనుకూల పరిస్థితులు లేవని, అనవసరం పార్టీ ఓటమి పాలవుతుందని, అలా కాకుండా తనకిస్తే విజయం సాధిస్తానని చంద్రబాబుకు ఏవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆళ్లగడ్డ సీటుపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications