విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ బీచ్‌లో నేవీ డే వేడుకలు అదుర్స్: ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నేవీ డే సందర్భంగా విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేళ నిర్వహిస్తున్న ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విన్యాసాలు తిలకించారు. రాష్ట్రపతికి ఐఎన్ఎస్ సింధు వీర్ జలాంతర్గామి ద్వారా బాంబర్లతో నౌకాదళం ఘన స్వాగతం పలికింది.

విశాఖ బీచ్‌లో నేవీ డే వేడుకలు

ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్నాథ్, క్రీడాకారిణి పీవీ సింధు తదితరులు హాజరయ్యారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించిన నౌకాదళం గీతం ఆకట్టుకుంది. భారీగా తరలివచ్చిన సందర్శకులతో ఆర్కే బీచ్ జనసంద్రంగా మారింది. విద్యుత్ ఆలంకరణతో మెరిసిపోయింది.

ఆకట్టుకున్న నేవీ విన్యాసాలు

త్రివర్ణ ప్యారాచూట్‌లో దిగిన స్కై డైవర్ అనూప్ సింగ్ రాష్ట్రపతికి నౌకాదళ ప్రచురణ ప్రతినిధి అందించి ఆవిష్కరింపజేశారు. నావికాదళ కమాండో బృందం నిర్వహించిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ఆహుతులను ఉత్కంఠకు గురిచేసింది. యుద్ధ నౌకలు, సబ్ మెరైన్ల నుంచి ఒకేసారి రాకెట్ ఫైరింగ్ ఆకట్టుకుంది. రాత్రి సమయంలో సముంద్రంపై విద్యుత్ కాంతులతో యుద్ధనౌకలు ఆకర్షణీయంగా నిలిచాయి.

యుద్ధనౌకల జలాంతర్గముల విన్యాసాలు

జెమినీ బోట్‌లోకి హెలికాప్టర్ నుంచి దిగిన మెరైన్ కమాండోలు సముద్ర జలాలపై అత్యంత వేగంగా ఒడ్డుకు దూసుకొచ్చారు. జెమినీ బోట్ నుంచి నేరుగా హెలికాప్టర్లలోకి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ అటాక్ చేసేందుకు మెరైన్ కమాండోలు గాల్లోకి లేచారు. త్రివర్ణ పతాక రెపరెపలతో గగన వీధుల్లో హెలికాప్టర్ విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సముద్ర జలాలపై యుద్ధనౌకల జలాంతర్గముల విన్యాసాలతో మెరైన్ కమాండోల విన్యాసాలు ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి.

ఆకాశంలోనూ... సముద్రంపైనా నేవీ విన్యాసాలు

ఎస్ఎస్ కంజీర్, కడ్మత్ నుంచి సముద్రంపై ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ సహ్యాద్రి యుద్ధనౌకలు విన్యాసాల కోసం ఉపయోగించారు. ఆకాశంలో చేతక్ హెలికాప్టర్ల సాహస విన్యాసాలు.., నాలుగు యుద్ధ నౌకలపై ఒకేసారి హెలికాప్టర్లు ల్యాండింగ్, టేకాఫ్ అవడం ఆకట్టుకున్నాయి. మిగ్ 29 యుద్ధ విమానాలతో ఆకాశంలో విన్యాసాలు చూపరులను గగుర్పాటుకు గురిచేశాయి.

English summary
President Draupadi Murmu attended as chief guest Navy day celebrations at Vizag beach.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X