ఇంద్రకీలాద్రికి రాష్ట్రపతి - భక్తులకు కీలక సూచనలు, దర్శనంలో మార్పులు..!!

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం విజయవాడకు రానున్నారు. 4 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఇంద్రకీలాద్రికి చేరుకుని, కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. రాత్రికి విజయవాడలోనే బస చేస్తారు. రాష్ట్రపతి పర్యటన వేళ భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు చేసారు.

విజయవాడ జనసేనకు దక్కేనా, కొత్త లెక్కలు- కూటమిలో ఎవరికెన్ని.. ఏవి..!!
విజయవాడ జనసేనకు దక్కేనా, కొత్త లెక్కలు- కూటమిలో ఎవరికెన్ని.. ఏవి..!!

రాష్ట్రపతి ముర్ము విజయవాడ పర్యటనలో భాగంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల నేపథ్యంలో, కొండపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేసారు. ఇంద్రకీలాద్రి కొండపై వాహనాల రాకపోకలు, విఐపి, ప్రోటోకాల్ వేళల్లో దేవస్థానం అధికారులు గణనీయమైన మార్పులు చేశారు. మధ్యాహ్నం 1:00 గంటల నుంచి కొండపైకి అన్ని రకాల వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం నుంచి, రాత్రి 7:45 గంటలకు కేటాయించిన ప్రోటోకాల్ దర్శన స్లాట్లను పూర్తిగా రద్దు చేశారు.

విజయవాడ జనసేనకు ఖరారు, మేయర్ అభ్యర్దిగా - అనూహ్య ఎంపిక..!?
విజయవాడ జనసేనకు ఖరారు, మేయర్ అభ్యర్దిగా - అనూహ్య ఎంపిక..!?
President Droupadi Murmu is scheduled to arrive in Vijayawada today for a two-day visit here the details

అదే విధంగా సాయంత్రం లేదా రాత్రి వేళల్లో అనుమతులు ఉన్న భక్తులు, ప్రముఖుల సౌకర్యార్థం ఉదయం 6:00 నుంచి 8:00 వరకు ఉండే ప్రోటోకాల్ సమయాన్ని ఒక గంట పెంచి ఉదయం 9:00 గంటల వరకు పొడిగించారు. రాష్ట్రపతి రెండో రోజు పర్యటన కొనసాగింపులో భాగంగా గురువారం ఉదయం 11 గంటలకు పున్నమి ఘాట్‌లో జరిగే 'జాతీయ సరస్‌ ఆజీవిక మేళా-2026'ను సందర్శించి.. దానిని అధికారికంగా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.10 నుంచి 2.10 వరకు డ్వాక్రా మహిళలు, లఖ్‌పతి దీదీలతో రాష్ట్రపతి భోజనం చేస్తూ ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 2.45కి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+