రఘురామకు షాక్ - రాష్ట్రపతి కార్యాలయం లేఖతో..!!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. రాజ్యంగ బద్దమైన పదవిలో ఉంటూ రాజకీయాలు.. టీవీ చర్చల్లో పాల్గొంటున్నారనే ఫిర్యాదు పైన రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రఘురామ పైన వచ్చిన ఫిర్యాదును పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో.. ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ లేఖ పైన ఏ విధంగా స్పందిస్తారనేది కీలకంగా మారుతోంది.
డిప్యూటీ స్పీకర్ రఘురామ పైన రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు అందింది. రాజ్యాంగ పదవిలో ఉండి పొలిటికల్ డిబేట్స్‌లో పాల్గొంటున్న రఘురామకృష్ణరాజుపై రాష్ట్రపతికి జేబీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ కుమార్ ఫిర్యాదు చేసారు. JBP ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాల యం స్పందించింది. ఈ ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్య దర్శికి రాష్ట్రపతి కార్యాలయం సిఫారసు చేసింది.

కాగా, డిప్యూటీ స్పీకర్‌పై చర్యలకు న్యాయస్థానా లను ఆశ్రయిస్తున్నట్లు తెలిపిన JBP పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. అయితే, రాష్ట్రపతి కార్యాలయం నుంచి సీఎస్ కు పంపిన లేఖలో పిటీషనర్ ఇచ్చిన రిపోర్ట్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు.
వాస్తవానికి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు తీసుకున్న వారు రాజకీయ పార్టీల కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని జడ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. రఘురామ టీవీ చర్చల్లో పాల్గొనటం.. రాజకీయ అంశాలపై ప్రత్యక్షంగా స్పందించకూడదని వివరిస్తున్నారు. ఇది ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పార్టీ ఫిర్యాదు చేసింది. తాజాగా రాష్ట్రపతి కార్యాలయం సూచనతో రఘురామపై చర్యలు తీసుకోవాలని సిఫారసు రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి స్పందన ఏంటనేది కీలకంగా మారుతోంది. అదే విధంగా ఈ లేఖ పైన సీఎస్ తిరిగి రాష్ట్రపతి కార్యాలయానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.














Click it and Unblock the Notifications