టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రతిష్టాత్మక అవార్డు

తెలుగుదేశం పార్టీ ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకటించిన 'గ్లోబల్ యంగ్ లీడర్స్ 2024' జాబితాలో ఆయనకు స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో ప్రభావశీలంగా పనిచేస్తున్న యువ నాయకులను ఈ ఫోరం ఎంపిక చేస్తూ ప్రతి ఏడాది ప్రకటిస్తుంది. ఈసారి భారత్ నుంచి మొత్తం ఏడుగురు ఎంపికయ్యారు.

2014లో కేవలం 26 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడు, 2024లో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలో పౌర విమానయాన శాఖ విశేషమైన పురోగతిని సాధిస్తోంది. దేశవ్యాప్తంగా విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు, చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాలకు వైమానిక సేవలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

prestigious-award-for-tdp-mp-and-union-minister-rammohan-naidu

ఇక ఈ గౌరవం తనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. 'భారత యువత ప్రపంచవ్యాప్తంగా కీలక నిర్ణయాలను తీసుకునే స్థానాల్లోకి ఎదుగుతున్న దృష్ట్యా, ఇది గొప్ప గుర్తింపుగా భావిస్తున్నానన్నారు. నిజాయితీతో, నూతన ఆలోచనలతో ప్రజలకు సేవ చేయాలనే నన్ను నిరంతరం గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి, ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ ఎదిగారన్నారు. కేబినెట్ మంత్రిగా దేశాన్ని సేవ చేయడం.. ఇప్పుడు ప్రపంచ వేదికపై గ్లోబల్ లీడర్‌గా గుర్తింపు పొందడం ప్రతి తెలుగువాడికీ గర్వకారణం అని పేర్కొన్నారు. ఆయన నాయకత్వ నైపుణ్యం, ప్రజాప్రయోజనాల పట్ల ఉన్న నిబద్ధత యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ గౌరవం ఆయనను మరింత ఉత్తేజపరిచేలా చేసి అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

గ్లోబల్ యంగ్ లీడర్‌గా ఎంపికైన మిగతా భారతీయులు ఎవరంటే..?

అనురాగ్ మాలూ - ఓరోఫైల్ వెంచర్స్ వ్యవస్థాపకుడు, పర్వతా రోహకుడు

రితేష్ అగర్వాల్ - ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ వ్యవస్థాపకుడు, సీఈవో

నిపున్ మల్హోత్రా - నిప్మాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు

అలోక్ మెడికేపుర అనిల్ - నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు

నటరాజన్ శంకర్ - బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఎండీ

మానసి సుబ్రమణ్యం - పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చీఫ్ ఎడిటర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+