యువతితో గడిపి, ఫొటోలను వాట్సప్‌లో పెట్టాడు
విజయవాడ/ విశాఖపట్నం: విజయవాడ నగరంలో ఓ యువకుడు అత్యంత దారుణమైన సంఘటనకు ఒడిగట్టాడు. ప్రేమ పేరుతో యువతిని కీచకుడు మోసం చేసిన ఉదంతం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాయకరావు పీఎస్ పరిధిలో ఉండే పూజారి కుమారుడు ఓయువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు.
యువతితో గడిపిన దృశ్యాలను ఆ యువకుడు వాట్సప్‌లో స్నేహితులకు పంపాడు. దీన్ని గుర్తించిన ఐద్వా మహిళలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవలసిందిగా యువతికి తెలిపారు. అయితే అందుకు యువతి నిరాకరించడంతో ఐద్వా మహిళలే ఈ ఘటనపై పాయకరావు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని నిర్భయ చట్టం, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

దొంగల ముఠా పట్టివేత
విశాఖపట్నం జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 473 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, రూ.5.66 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇకపై కేసులను ఛేదించిన పోలీసులకు రివార్డులు అందజేయనున్నట్లు సీపీ అమిత్‌గార్గ్ ప్రకటించారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం మండలం చేమచింత జీడితటల్లో శివ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గతేడాది గాజువాకలో ఓ యువతి హత్యకేసులో దోషిగా ఉన్న శివ కొన్ని రోజులు జైల్లో శిక్ష అనుభవించాడు. శివ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications