Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోదీ మార్క్ దెబ్బ‌..ఇంత‌లా: చ‌ంద్ర‌బాబును కోలుకోనీయ‌కుండా: ఇక‌..టీడీపీ మ‌నుగ‌డ క‌ష్ట‌మేనా..!

ప్ర‌ధాని మోదీ..బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా ఏదైనా చేయ‌గ‌ల‌ర‌నే వాద‌న ఉంది. అయితే, చంద్ర‌బాబును ఇంత త్వ‌ర‌గా కోలుకోలేని దెబ్బ తీస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. రెండో సారి కేంద్రంలో మోదీ అధికారంలోకి రాగానే..ఏపీలో వైపీపీ అధికారంలోకి రావ‌టంతో త‌మ‌కు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని టీడీపీ నేత‌లు అంచ‌నా వేసారు. అయితే, ఇంత త్వ‌ర‌గా బీజేపీ ఆప‌రేష‌న్ మొద‌లు పెడుతుంద‌ని ఊహించ‌లేదు. త‌న‌ను ఏపీలో డామేజ్ చేసి..పార్టీని దెబ్బ తీసి..త‌న‌ను అవ‌మానించిన చంద్రబాబును అదే స్థాయిలో మోదీ ఇప్పుడు దెబ్బ కొడుతున్నారు. మ‌రి..ఇక టీడీపీ మ‌నుగ‌డ ఏపీలో సాధ్య‌మేనా..ఏం జ‌రుగుతోంది..

 చంద్రబాబు దెబ్బ‌కు మోదీ ప్ర‌తీకారం..

చంద్రబాబు దెబ్బ‌కు మోదీ ప్ర‌తీకారం..

2014 ఎన్నిక‌ల్లో చంద్రబాబు..మోదీ మిత్రులు. కానీ, కాలం గ‌డిచేకొద్దీ వారిద్ద‌రూ రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్ధులు అయ్యారు. ప్ర‌త్యేక హోదా పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం నుండి టీడీపీ బ‌యటకు వ‌చ్చింది. అదే స‌మ‌యంలో ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది. ఇక‌..మోదీ పైన తానొక్క‌డినే పోరాటం చేస్తున్నాన‌నే భావ‌న క‌లిగించేందుకు చంద్ర‌బాబు బాగా త‌ప‌న ప‌డ్డారు. దీని ద్వారా ఏపీలో అధికారం తిరిగి ద‌క్కించుకోవ‌టంతో పాటుగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాల‌ని నాడు చంద్ర‌బాబు విప‌రీతంగా ప్ర‌య‌త్నించారు. దీని కోసం మోదీ పైన ప్ర‌జ‌ల్లో ఉన్న అంచ‌నాల‌ను..అభిప్రాయ‌ల‌ను స‌రిగ్గా అంచ‌నా వేయ‌లేక పోయారు. అవ‌స‌ర‌మైన దాన కంటే మోదీతో వైరం పెట్టుకున్నారు. ఏపీకి మోదీ..అమిత్ షా వ‌చ్చిన స‌మ‌యంలో టీడీపీ నేత‌ల నిర‌స‌న‌లు శృతి మించాయి. ఏపీకి అస‌లు మోదీ శ‌త్రువుగా క్రియేట్ చేయ‌టంలో చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు. అదే మోదీకి ఆగ్ర‌హం తెప్పించింది.

మోదీని దోషిగా..బీజేపీని ఏపీ నుండి దూరం చేసేందుకు

మోదీని దోషిగా..బీజేపీని ఏపీ నుండి దూరం చేసేందుకు

ఏపీలో తాను తిరిగి అధికారంలోకి రావ‌టం కోసం నాడు చంద్ర‌బాబు మోదీని ప్ర‌ధాన ముద్దాయిగా చూపించి..ఆయ‌న‌ను తాను మాత్ర‌మే ఎద‌ర్కోగ‌ల‌న‌ని..త‌న‌కు త‌న‌ను పోరాట యోధుడిగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెప్పుకొన్నారు. కేంద్రం సాయం చేసినా..అస‌లు మోదీ ఏపీకి ఏం చేయ‌లేద‌ని ప్ర‌చారం చేసారు. చేసిన సాయం గురించీ చెప్ప‌లేదు. అదే స‌మ‌యంలో మోదీని ఏపీలో విల‌న్ గా చూపించే ప్ర‌య‌త్నం చేయ‌టంతో పాటుగా బీజేపీని ఏపీలో నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేసారు. ఇక‌, మోదీని ప‌దేప‌దే త‌న‌కంటే జూనియ‌ర్ అని..గోద్రా ఘ‌ట‌న‌ల్లో మోదీ రాక్ష‌సంగా వ్య‌వ‌హ‌రించార ని వేలాది మందిని చంపించార‌ని చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. మోదీని అరెస్ట్ చేయాల‌ని తొలుత డిమాండ్ చేసింది తానే అంటూ చంద్ర‌బాబు ప‌లు మార్లు చెప్పుకొచ్చారు.

రాహుల్‌ను ప్ర‌ధానిని చేయ‌టం కోసం...

రాహుల్‌ను ప్ర‌ధానిని చేయ‌టం కోసం...

అప్ప‌టి వ‌ర‌కు ఎన్డీలో భాగ‌స్వామిగా ఉంటూ..బ‌య‌ట‌కు రాగానే రాహుల్ నివ‌సానికి వెళ్లి మిత్ర‌పక్షంగా ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌ను మేనేజ్ చేస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. ఇవి రాజ‌కీయంగా సాధార‌ణ అంశాలే అయినా..మోదీ పైన చేసిన వ్య‌క్తిగ‌త అరోప‌ణ‌ల ఫ‌లిత‌మే చంద్ర‌బాబు మీద మోదీ ఈ స్థాయిలో టార్గెట్ చేయటానికి కార‌ణంగా చెబుతున్నారు. మోదీ భార్య గురించి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల మీద అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. ఇక‌, బీజేపీని ఏపీ నుండి దూరం చేయాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తే..ఏపీలో టీడీపీ లేకుండా చేట‌య‌మే ల‌క్ష్యంగా ఇప్పుడు మోదీ..అమిత్ షా ప‌ని చేస్తున్నారు. మరి..ఈ సంక్షోభ స‌మ‌మంలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిల‌చేదెవ‌రు..టీడీపీ తిరిగి కోలుకుంటుందా అంటే కాల‌మే స‌మాధానం చెప్పాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+