ఏపీకి ప్రధాని మోదీ: వరాలు ప్రకటిస్తారా: ఎన్నో ఆశలతో జగన్..!
Recommended Video
ప్రధానిగా రెండో సారి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సారిగా మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు ప్రధాని రానున్నారు. అయితే, ఆయనతో ముఖ్యమంత్రి జగన్ అధికారిక భేటీలకి సమయం కోరుతున్నారు. శ్రీవారి దర్శనం తరువాత ఏపీ సమస్యల పైన మరోసారి చర్చించేందుకు ఈ భేటీని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. మోదీ రాక సమాచారం ఖరారు కావటంతో..కేంద్రానిని నివేదించాల్సిన అంశాల పైన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు.
మోదీ పర్యటన పైన ఆసక్తి..
ప్రధాని మోదీ ఈ నెల 9వ తేదీన ఏపి పర్యటన ఖరారైంది. మోదీ ఢిల్లీ నుండి నేరుగా తిరుపతి వచ్చి అక్కడి నుండి తిరుమల వెళ్లి..శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే, ఆయనకు స్వాగతం పలకటానికి..ప్రధానితో పాటుగా తిరుపతి పర్యటనలో గవర్నర్ నరసింహన్..సీఎం జగన్ పాల్గొంటున్నారు. అయితే, ఏపీలో ఉన్న ప్రత్యక పరిస్థితులపైన ప్రమాణ స్వీకారానికి ముందుగానే జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధానికి వివరించారు.

పూర్తి వివరాలతో వస్తే మరోసారి చర్చిద్దామంటూ సూచించారు. 2014 ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి వేదికగానే ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని అభ్యర్దిగా మోదీ హామీ ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హోదా ఇవ్వలేమని .. ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే..అదీ సైతం ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇక, ఇప్పుడు కేంద్రంలో మరో సారి అధికారంలోకి రావటం...ఏపీలోనూ ప్రభుత్వం మారటంతో మోదీ ఆలోచనల్లో సైతం మార్పు వస్తుందని అంచనా వేస్తున్నారు.
మళ్లీ నిరసనలు ఉంటాయా..
టీడీపీ కేంద్ర ప్రభుత్వంతో విభేదించిన తరువాత ఏపీ పర్యటకు వచ్చిన ప్రధాని మోదీ..తిరుపతికి వచ్చిన బీజేపీ జాతీయాధ్యక్షుడు లమిత్ షాకు నిరసనల సెగ తప్పలేదు. అయితే, ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారటంతో ప్రధానికి నిరసనలు ఉండే అవకాశం లేదు. రాజకీయంగానూ ఏపీలో బీజేపీ పూర్తిగా బలహీన పడింది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ప్రధాని మోదీ ఏపీ పైన దృష్టి సారిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇక, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారం నాడు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాన ఏపీని అత్యున్నత స్థానంలో నిలిపేందుకు కలిసి పని చేద్దామని..కేంద్రం సంపూర్ణ సహకారం ఇస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఇక, తిరుపతి వేదికగా ప్రధాని ఏపీకి అండగా నిలిచే విషయంలో సానునూల ప్రకటన చేస్తారని జగన్ ఆశలు పెట్టుకున్నారు. మరి.. మోదీ ఏం చేస్తారనేది వేచి చూడాల్సిందే..












Click it and Unblock the Notifications