కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది: జగన్‌కు ప్రధాని మోదీ హామీ: ఏపీని ఉన్నత స్ధానాలకు తీసుకెళ్దాం.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌కు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ..కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలోనే ముగ్గురు ప్రముఖులు ట్వీట్ చేసారు. జగన్‌తో పాటుగా ఏపీ ప్రజకు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీకీ సంపూర్ణ సహకారం..
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం వేళ..ప్రధాని మోదీ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీకీ కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇద్దరం కలిసి ఏపీని అత్యున్నత స్థానాలకు తీసుకెళ్దామని మోదీ సూచించారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ వద్దకు వెళ్లి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. అయితే ఇదే రోజు తన ప్రమాణ స్వీకారం ఉండటంతో.. తాను రాలేనని మోదీ స్పష్టం చేసారు. అదే రోజు జగన్ ఏపీ సమస్యల పైన మోదీతో సుదీర్ఘంగా చర్చించారు. ఏపీకి సాయం చేయాలని..అండగా నిలవాలని అభ్యర్దించారు. ప్రత్యేక హాదా గురించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. అయితే, ప్రధాని సానుకూలంగా స్పందించారని జగన్ స్పష్టం చేసారు. ఆ తరువాత ట్వీట్ చేస్తూ జగన్‌తో మంచి సమావేశం జరిగిందని.. కేంద్రం తమ వంతు సహకారం అందిస్తుందని స్పష్టం చేసారు.

రాష్ట్రపతి..రాహుల్ సైతం..
రాష్ట్రపతి కోవింద్ సైతం ట్విట్టర్ ద్వారా జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్దికి..ఏపీని అత్యున్నత స్థాయి లో నిలిపేలా జగన్ పాలన ఉండాలని ఆకాంక్షించారు. జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసారు. జగన్..ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఏపీ అభివృద్ది పధంలో సాగాలని ఆకాంక్షించారు. అయతే, జగన్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ ప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు. అయితే, కేసీఆర్.. స్టాలిన్..పుదుచ్చేరి ప్రభుత్వం నుండి మంత్రి కృష్ణారావు హాజరయ్యారు. కేంద్ర మాజీ ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం జగన్‌ను ట్విట్టర్ ద్వారా అభినందించారు.












Click it and Unblock the Notifications