ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు.. ఏపీ ప్రజల ఆశలపై నీళ్ళు!
ఏపీ వాసుల కలలు నెరవేర్చేందుకు చేయ తలపెట్టిన భారత ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దయ్యింది. ఏపీ వాసుల ఆశలపై తుఫాను నీళ్ళు చల్లింది. తీవ్ర తుఫాన్ ఏపీకి పొంచి ఉన్న నేపధ్యంలో, ఐఎండీ హెచ్చరికలతో ప్రధాని మోదీ పర్యటన రద్దయినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
ప్రధాని విశాఖ పర్యటన రద్దు
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 29వ తేదీన విశాఖ నగరంలో పర్యటిస్తారని అధికారులు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా అక్కడ రోడ్ షో లోనూ, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలోనూ పాల్గొనాల్సి ఉండగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాజా తుఫాను హెచ్చరికల నేపధ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రద్దయ్యింది.

కోస్తాంధ్రపై తుఫాను ప్రభావం...
తుఫాను ప్రభావం ఏపీలోని కోస్తాంధ్రపై ఉండనున్న నేపధ్యంలో ఈ నెల 29వ తేదీన జరగవలసిన ఆయన పర్యటనను రద్దు చేస్తూ పీఎంఓ ఆఫీసు నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ పర్యటన కోసం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భారీ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. కానీ అనుకోని విధంగా వాతావరణ పరిస్థితుల కారణంగా మోదీ విశాఖ పర్యటన రద్దయ్యింది.
ప్రజల ఆశలు అడియాశలు చేసిన తుఫాను
ఏపీ ప్రజలు ప్రధాని మోదీ పర్యటనపై చాలా ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో తుఫాను ప్రజల ఆశలను అడియాశలు చేసింది. ఒకవేళ మోదీ విశాఖలో పర్యటిస్తే అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడకలో 85000 కోట్లు పెట్టుబడితో నిర్మించే ఎన్టిపిసి నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా విశాఖవాసుల దశాబ్దపు కల రైల్వే జోన్ 2కు కూడా ప్రధాన నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసేవారని సమాచారం.
బీజేపీ శ్రేణులలోనూ నిరాశ
వీటితో పాటు అనేక కీలక ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు చెయ్యాల్సి ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షోలోనూ, అలాగే భారీ బహిరంగ సభలోనూ ఆయన ప్రసంగించాల్సి ఉంది. కానీ ఆయన పర్యటన రద్దుతో ఆ అవకాశం లేకుండా పోయింది. మోదీ పర్యటన ఉందని జోష్ లో ఉన్న బీజేపీ శ్రేణులను సైతం తుఫాను హతాశులను చేసింది.












Click it and Unblock the Notifications