ఏదో ఒకటి ప్రకటించాలి : చంద్రబాబే మా లక్ష్యం : మోదీ పర్యటనతో మార్పులు
కొంత కాలంగా టిడిపి వర్సెస్ బిజెపి గా మారిన ఏపి రాజకీయాల్లో కొత్త సంవత్సరంలో కొత్త సమీకరణాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఏపి పై కేంద్రం వివక్ష చూపుతుందంటూ టిడిపి అధినేత ఏపి మొదలు జాతీయ స్థాయిలో బిజెపి కి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దీంతో..ఏపిలో తమ ఉనికి నిలబెట్టుకొనేందుకు బిజెపి కార్యాచరణ సిద్దం చేస్తోంది. అందులో భాగంగా..ప్రధాని మోదీని ఏపికి తీసుకొచ్చి కేంద్రం నుండి అందిన సాయం గురించి వివరించటంతో పాటుగా ఏపికి పెండింగ్ హామీల్లో ఒకటైన ప్రకటించేలా చూడాలని జాతీయ నాయకత్వం పై ఒత్తిడి తెస్తున్నారు.
జనవరి 6న ప్రధాని మోదీ ఏపికి రావటం దాదాపు ఖరారైంది. రాయలసీమ లో పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆ సభలో ప్రధాని ప్రసంగం ఏపిలో బిజెపికి కీలకంగా ఉండేలా చూడాలని ఏపి బిజెపి నేతలు ఆశిస్తున్నారు. అదే సమయం లో విశాఖ రైల్వేజోన్ గానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ గానీ ఏదో ఒకటి ఆయన ప్రకటిస్తేనే ప్రజల అంచనాలను అందుకుంటాం' అని బీజేపీ రాష్ట్ర నేతలు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర పదాధికారులు, పార్లమెంటు, అసెంబ్లీ కన్వీనర్ల సమావేశం జరిగింది.

జనవరి 6న రాష్ట్రంలో మోదీ సభపై విస్తృత చర్చ జరిగింది. సుమారు 5లక్షల మందిని సభకు సమీకరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే సభావేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై తుది నిర్ణయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకే అప్పగించారు. రెండ్రోజుల్లో ఆయన పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం కానున్నారు. రైల్వేజోన్‌పై ఈలోపే నిర్ణయం తీసుకుంటే సభ విశాఖలో, ఉక్కు ఫ్యాక్టరీపై నిర్ణయం తీసుకుంటే రాయలసీమలో.. ఈ రెంటికీ అవకాశం లేకపోతే అమరావతి కేంద్రంగా సభ పెట్టి రాజధానికి నిధులైనా ప్రకటించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ నేతలకు తెలిసింది. ఏదో ఒకటి ప్రకటిస్తేనే బీజేపీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రజల్లోకి వెళ్లగలమని పార్టీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు.
ఇప్పటికే ఏపిలో పార్టీ బలోపేతానికి ఏం చేయాలో సూచిస్తూ నివేదిక ఇవ్వాలని పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఏపి బిజెపి నేతలను కోరారు. ప్రధాని..అమిత్ షా సభల ద్వారా ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఏపి నేత లు జాతీయ నాయకత్వాన్ని కోరారు. తాము కూడా చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి కౌంటర్ మొదలు పెడతామని బిజెపి జాతీయ నాయకత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో..జనవరి నుండి ఏపిలో సరి కొత్త రాజకీ యానికి తెర లేవనుంది..












Click it and Unblock the Notifications