వేధింపులు తాళలేక.. సైబర్ క్రైమ్ పోలీసులకు పృథ్వీరాజ్ ఫిర్యాదు
తాను ఒక నటుడిగా సినిమా ఫంక్షన్ వేదికపై చేసిన వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టార్గెట్ చేశాయని సినీనటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చెప్పారు. రెండు రోజులుగా వైసీపీ సోషల్ మీడియా తనను వేధిస్తోందంటూ కుటుంబసభ్యులతో వచ్చి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పృథ్వీరాజ్ (Pridhvi Raj). ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ' నా నెంబర్ సోషల్ మీడియా గ్రూప్‌లో ఉంచి 1800 కాల్స్ చేయించారు. మా అమ్మ, భార్య, పిల్లలను తిట్టించారు. వారి వేధింపులు తాళలేక ఆస్పత్రిలో చేరా. అనిల్ పేరుతో పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఆధారాలతో ఫిర్యాదు చేశా. త్వరలో ఏపీ హోంమంత్రిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తా. నన్ను వేధించిన వారిపై కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేస్తాం' అని పృథ్వీరాజ్ తెలిపారు.

11 అనే నెంబర్‌ని చూస్తే చాలు వైసీపీవాళ్లు గడగడ వణికిపోతున్నారన్నారు పథ్వీ. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడలేదని అన్నారు. అక్కడికి వచ్చిన ప్రేక్షకులను నవ్వించడానికే అలా మాట్లాడానని చెప్పారు. కానీ, అది వైసీపీకి అన్వయిస్తూ ప్రచారం చేసుకున్నారని అన్నారు. గత రెండు రోజులుగా తనను వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు.
కాగా, హీరో విశ్వక్ సేన్ నటించిన లైలా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు చెబుతూ 150 మేకల్లో చివరకు 11 మేకలే మిగిలాయని పృథ్వీరాజ్ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ కొందరు వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించినట్లు పృథ్వీ తెలిపారు. తనను వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
-
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
మావిగాన్ ను జనాల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ..! పేర్ని నాని షాకింగ్..! -
Kerala Elections: కేరళ పోలింగ్ పై సీక్రెట్ గా ఈసీ..! కాంగ్రెస్ డౌట్స్..! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె












Click it and Unblock the Notifications