భగవంతుడా.. ఏపీలో మరో రెండు ప్రైవేట్ బస్సు ప్రమాదాలు !!

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదం నింపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టి, అనంతరం మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది సజీవ దహనమయ్యారు.

అలానే చేవెళ్ల సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు ( నవంబర్ 4, 2025 ) ఒక్కరోజే రెండు ప్రైవేట్ బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా.. 25 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

private-bus-accidents-in-satyasai-and-eluru-districts-and-people-died

ఏలూరు జిల్లాలో ఒకరు మృతి, పది మందికి గాయాలు..

ఏలూరు జిల్లాలోని లింగపాలెం మండలం జూబిలినగర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున తీవ్రమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారతి ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అయ్యపరాజ గూడెంకి చెందిన వీరంకి ప్రవీణ్ (28) అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాగా ప్రమాదానికి ముందు బస్సు ధర్మాజీగూడెం వద్ద ఒక బైక్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. బైక్‌పై ఉన్న వారు వెంటపడుతారన్న భయంతో డ్రైవర్ బస్సును అధిక వేగంతో నడిపాడు. దీంతో టర్నింగ్ దగ్గర నియంత్రణ కోల్పోయి బస్సు బోల్తా పడింది. బస్సు ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికులు గాయపడిన వారిని సమీపంలోని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళ మృతి, ఎనిమిది మందికి గాయాలు..

శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద మరో ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జబ్బర్ ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి 2 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఢీ కొట్టిన వేగం తాళలేక బస్సు రోడ్డుపైనే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ఓ మహిళ మృతి చెందగా.. మరో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని చెన్నేకొత్తపల్లి, ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.

మరోవైపు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కూడా మరో ప్రమాదం సంభవించింది. కావలి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. రహదారిపై వెళ్తున్న ఒక ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపైనే బోల్తా పడగా నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర రవాణాశాఖ అధికారులు అత్యవసర సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+