హైటెక్ బస్సు దగ్ధం: తప్పిన ముప్పు (పిక్చర్స్)
ప్రకాశం: తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన హైటెక్ బస్సు బుధవారం వేకువజామున ప్రకాశం జిల్లా ఉలవపాడు సమీపంలో దగ్ధమైంది. ఈ ఘటనలో ప్రయాణికులు, డ్రైవర్ అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఉలవపాడు పోలీసులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ నుంచి మంగళవారం సాయంత్రం 7.45నిమిషాలకు 36 మంది ప్రయాణికులతో హైదరాబాదుకు బయలుదేరింది పర్వీన్ ట్రావెల్స్ బస్సు (టిఎన్ 21 ఎకె 8307).
బుధవారం తెల్లవారుజామున 1:30గంటల ప్రాంతంలో నెల్లూరు జిల్లా కావలి వద్దకు చేరుకోగానే బస్సు నుంచి వాసన వస్తుండడంతో డ్రైవర్ దిగి టైర్లు వగైరా పరిశీలించి ఏటువంటి అనుమానం రాకపోవడంతో, తిరిగి ప్రయాణం అయ్యాడు. తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగొల్లు వద్దకు బస్సు చేరుకోగానే వెనుక నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి.
ఈ సమయంలో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉండగా వెనుక వైపు కూర్చున్న ప్రయాణికులు డ్రైవర్ తంగవేలును అప్రమత్తం చేశారు. కేకలు వేయడంతో ప్రయాణికులందరూ నిద్రలేచారు. దీంతో డ్రైవర్ అప్రమత్తతతో బస్సును నిలిపివేసి ప్రయాణికులను దించేశాడు. లగేజిని బయటకు తీసే ప్రయత్నం చేస్తుండగా మంటలు వ్యాపించాయి. దీంతో అందరూ దూరంగా పరుగులు తీశారు.
బస్సులో ఉన్న ప్రయాణికుల విలువైన సామాగ్రి కూడా కాలి బూడిదైంది. బస్సు పూర్తిగా కాలిపోయింది. తమను ఎవరూ పట్టించుకోలేదంటూ ప్రయాణికులు ఆగ్రహంతో రోడ్డుపై 20 నిమిషాల పాటు రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న కందుకూరు సిఐ ఎం లక్ష్మణ్ సంఘటన స్థలాన్నికి చేరుకొని విచారణ చేయిస్తామని హామీ ఇవ్వడంతో ప్రయాణికులు ఆందోళన విరమించారు.

దగ్ధమైన బస్సు
తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన హైటెక్ బస్సు బుధవారం వేకువజామున ప్రకాశం జిల్లా ఉలవపాడు సమీపంలో దగ్ధమైంది.

దగ్ధమైన బస్సు
ఈ ఘటనలో ప్రయాణికులు, డ్రైవర్ అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

దగ్ధమైన బస్సు
ఉలవపాడు పోలీసులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ నుంచి మంగళవారం సాయంత్రం 7.45నిమిషాలకు 36 మంది ప్రయాణికులతో హైదరాబాదుకు బయలుదేరింది పర్వీన్ ట్రావెల్స్ బస్సు (టిఎన్ 21 ఎకె 8307).

దగ్ధమైన బస్సు
బుధవారం తెల్లవారుజామున 1:30గంటల ప్రాంతంలో నెల్లూరు జిల్లా కావలి వద్దకు చేరుకోగానే బస్సు నుంచి వాసన వస్తుండడంతో డ్రైవర్ దిగి టైర్లు వగైరా పరిశీలించి ఏటువంటి అనుమానం రాకపోవడంతో, తిరిగి ప్రయాణం అయ్యాడు.

దగ్ధమైన బస్సు
తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగొల్లు వద్దకు బస్సు చేరుకోగానే వెనుక నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి.

దగ్ధమవుతున్న బస్సు
ఈ సమయంలో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉండగా వెనుక వైపు కూర్చున్న ప్రయాణికులు డ్రైవర్ తంగవేలును అప్రమత్తం చేశారు. కేకలు వేయడంతో ప్రయాణికులందరూ నిద్రలేచారు.












Click it and Unblock the Notifications