సిబిఐ దర్యాప్తు పూర్తి: జగన్ బెయిల్‌పై ఉత్కంఠ

వైయస్ జగన్ ఆస్తులపై ఆదాయం పన్ను శాఖ (ఐటి శాఖ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విడివిడిగా దర్యాప్తు చేస్తున్నాయని, వాటికి తమ దర్యాప్తు నివేదికలను అందిస్తామని సిబిఐ తెలిపింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇప్పటి వరకు సిబిఐ పలు చార్జిషీట్లను దాఖలు చేసింది.
సండూర్ పవర్, కార్మెల్ ఏషియా, పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాలిటీ కంపెనీ, బ్రహ్మణి ఇన్‌ఫ్రాటెక్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, మంత్రి డెవలపర్స్ కంపెనీల్లో క్విడ్‌ప్రోకో ఆధారాలు లేవని సీబీఐ తెలిపింది. అయితే ఈ కేసుల్లో ఇతర ఉల్లంఘనలకు పాల్పడ్డారని, వీటిపై చర్యలకు ఐటీ, ఈడీ విభాగాలకు సిఫార్సు చేసినట్లు సిబిఐ పేర్కొంది.
కాగా, వైయస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం కోర్టు నిర్ణయం వెలువడనుంది. జగన్‌కు బెయిల్ లభిస్తుందా, లేదా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో ఆయనకు బెయిల్ లభించవచ్చుననే వాదన బలంగా వినిపిస్తోంది.
ఆస్తుల కేసులో వైయస్ జగన్ ఆరెస్టయి హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై కోర్టులో వాదోపవాదాలు పూర్తయ్యాయి. కోర్టు తన తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఈ తీర్పు సోమవారం మధ్యాహ్నం వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications