వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ రాజీనామా చేస్తే: ఆనం, మోసం చేసినట్లే: లగడపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anam Ramanrayana Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే సమస్యలు పరిష్కారం కావని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా కిరణే కొనసాగుతారని స్పష్టం చేశారు.

తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రాదన్న వారికి రాజ్యాంగం గురించి తెలియదన్నారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు రావడం ఖాయమని, దానిని ఓడించడం అంతే ఖాయమని ఆనం చెప్పారు.

రాజీనామాలపై లగడపాటి

రాజీనామాలు ఆమోదింపజేసుకోవడం తమ ప్రాథమిక హక్కు అని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ న్యూఢిల్లీలో అన్నారు. సోమవారం ఉదయం స్పీకర్ మీరా కుమార్‌ను కలిసేందుకు లగడపాటి యత్నించగా, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరోసారి స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఆమోదింపజేసుకుంటామని తెలిపారు.

వేరే రాష్ట్రాల ఎంపీల రాజీనామాలు ఆమోదింపజేస్తుండగా తమ రాజీనామాలు ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ అన్ని వివరాలు చెప్పిందని, అన్యాయం ఎవరికీ జరుగలేదన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్లు చేస్తే రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నారు. రాజీనామా చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆమోదించలేదని, రాజీనామాల ఆమోదం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని ఆయన చెప్పారు.

మేనిఫెస్టోను ఉల్లంఘిస్తే ప్రజలను మోసం చేసినట్టే అని ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు సమన్యాయం కోరుకోవడం లేదని, సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని లగడపాటి అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం మైనార్టీలో ఉందని, 232 మంది ఎంపీల్లో 19 మంది రాజీనామా చేసి వెళ్లిపోతే 213 మంది ఎంపీలే ఉంటారని, కాబట్టి ఏదైనా జరగొచ్చన్నారు.

English summary

 Minister Anam Ramanrayana Reddy on Monday said problems will not solved by Kiran Kumar Reddys resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X