'మంత్రి ఆది మోసం.. నెల రోజులు డెడ్ లైన్, ఇవ్వకపోతే ఆత్మహత్యే'
Recommended Video

అమరావతి: విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించి.. వందల కోట్ల రూపాయలు ఎగవేసినట్టు కేశవరెడ్డి స్కూల్స్ యాజమాన్యంపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. మంత్రి ఆది నారాయణరెడ్డికి కేశవరెడ్డి వియ్యంకుడు కావడంతో ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మరో బాధితుడు తాజాగా తెరపైకి వచ్చాడు. కేశవరెడ్డి విద్యా సంస్థలకు అప్పు ఇచ్చి మోసపోయామని ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వకుండా మంత్రి ఆదినారాయణరెడ్డి తమను తిప్పుకుంటున్నారని ఆరోపించారు.
ఆరేళ్లుగా ఇదిగో.. అదిగో.. అంటూ కాలక్షేపం చేశారని ఆరోపించారు. మంత్రి హామిపై ఇక నమ్మకం లేక భార్య హైమావతి, ముగ్గురు సంతానంతో కలసి సచివాలయం గేట్-2 వద్ద శ్రీనివాస్ రెడ్డి పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. దీంతో సచివాలయం వద్ద కలకలం రేగింది.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆత్మహత్యను అడ్డుకుని అక్కడినుంచి పంపించేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మీడియాతో తన గోడు వెల్లబోసుకున్నారు. 2012లో ఓ మధ్యవర్తి ద్వారా కేశవరెడ్డికి రూ.5లక్షలు అప్పుగా ఇచ్చామన్నారు.
8నెలల పాటు వడ్డీ ఇచ్చారని, ఆ తర్వాత ఇవ్వడం మానేశారని చెప్పారు. ఈ విషయమై మంత్రిని సంప్రదిస్తే.. తానున్నానని భరోసా ఇచ్చారని, కానీ ఆ తర్వాత చేతులు దులుపేసుకున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు కేవలం రూ.1లక్ష మాత్రమే, అది కూడా పలు దఫాలుగా ఇచ్చారని చెప్పారు.
ఇదే విషయమై సీఎంను కలిసినా.. చేస్తాం.. చూస్తాం.. అన్నారు తప్పితే న్యాయం జరిగింది లేదని వాపోయారు. నెల రోజుల్లోగా తమ డబ్బు తమకు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications