అల్లు అరవింద్ మాట్లాడింది ఆయన గురించేనా?

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఎప్పుడు మాట్లాడినా ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతారు. కాకపోతే అది ఏ సందర్భంలోనిది? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అందుకు దారితీసిన సంగతులేమిటనేది మాత్రం విన్నవారు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తాను మాట్లాడింది ఎవరి గురించో మాత్రం చిన్న హింట్ ఇస్తారు. పరిశ్రమలో ఎవరి గురించి మాట్లాడారో సులువుగానే అర్థమైపోతుంది.

2018 సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన అల్లు అరవింద్ భవిష్యత్తులో తాను తీయబోయే ప్రాజెక్టుల గురించి చెప్పారు. కార్తికేయ2 లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన చందూ మొండేటితో తమ బ్యానరులో రెండు సినిమాలు వస్తాయని, అందుకు కమిట్ మెంట్ కూడా ఇచ్చారని, కొంతమందిలా మూలాలు మర్చిపోయి వెన్నుపోటు పొడిచే రకం కాదని ప్రశంసలతో ముంచెత్తారు.

 alluarvind-

అల్లు అరవింద్ వేసిన పంచ్ పరశురామ్ మీదేనని అర్థమవుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానరులో విజయ్ దేవరకొండతో చేయాల్సిన సినిమాను పరశురామ్ హఠాత్తుగా దిల్ రాజువైపు తిప్పేశాడు. ఈ విషయంలో అల్లు బాగా హర్టయ్యారు. గోత గోవిందం కాంబినేషన్ రిపీట్ చేయాలనేది ఆయన కోరిక. అయితే పరశురామ్ నుంచి అకస్మాత్తుగా ట్విస్టు రావడంతో అనౌన్స్ మెంట్ రోజే ప్రెస్ మీట్ పెట్టి విషయాన్ని బయటపెట్టాలనుకున్నారు. అయితే కొందరు సర్దిచెప్పడంతో అరవింద్ వెనక్కి తగ్గారు. అయితే ఆయనతో ఆ ఫీలింగ్ మాత్రం అలాగే ఉండిపోయిందని సన్నిహితులు చెబుతున్నారు.

రామ్ తో బోయపాటి శ్రీను చేస్తున్న సినిమా తర్వాత తమ బ్యానరులో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లు చెప్పారు. సరైనోడు కాంబినేషన్ ను రిపీట్ చేస్తారా? లేదంటే కథానాయకుణ్ని మారుస్తారా? అన్నది తేలలేదు. సినీ పరిశ్రమలో చేతులు మారిపోయే సినిమాల గురించి ప్రతిరోజు కథనాలు వస్తూనే ఉంటాయి. అయితే అవి బయటపడే సందర్భాలు చాలా అరుదు. ఇటీవలే హీరో నాగచైతన్య కూడా పరశురామ్ గురించి చెప్పి తన అసంతృప్తిని వెలిబుచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+