వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పోసాని మాటల్లో 10 అసత్యాలు, నిరూపించు, 1998లో గుణశేఖర్ ఇలానే చేశారు'

నంది అవార్డులపై మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీ ఘాటుగా స్పందించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఆయన వ్యాఖ్యలను ఇప్పటికే టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. ఆయనకు కౌంటర్లు వేస్త

|
Google Oneindia TeluguNews

అమరావతి: నంది అవార్డులపై మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీ ఘాటుగా స్పందించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఆయన వ్యాఖ్యలను ఇప్పటికే టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. ఆయనకు కౌంటర్లు వేస్తున్నారు.

Recommended Video

Nandi Awards controversy : పోసానికి లోకేష్ కౌంటర్, కులంతో బాలకృష్ణ కి ఝలక్
పోసాని వ్యాఖ్యల్లో పది అసత్యాలు

పోసాని వ్యాఖ్యల్లో పది అసత్యాలు

నిర్మాత సత్యారెడ్డి కూడా పోసాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు తెలుగు సినీ పరిశ్రమ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడే విధంగా పోసాని మాట్లాడారని నిర్మాత అన్నారు. అసలు పోసాని మాట్లాడిన ఆరోపణల్లో 10 ఆరోపణలు అవాస్తవాలని చెప్పారు.

'పోసాని! నిజాలు తెలుసుకో, ఆస్తుల రక్షణకు లోకేష్‌ను పావుగా వాడుకుంటారా''పోసాని! నిజాలు తెలుసుకో, ఆస్తుల రక్షణకు లోకేష్‌ను పావుగా వాడుకుంటారా'

అలా, ఎప్పుడు, ఎవరు, ఎక్కడ అన్నారో చెప్పాలి

అలా, ఎప్పుడు, ఎవరు, ఎక్కడ అన్నారో చెప్పాలి

అందులోని మొదటి ఆరోపణ అవార్డుల గురించి ప్రశ్నిస్తే, నంది అవార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందని పోసాని అన్నారని, మరి అలా ఎవరు ఎప్పుడు ఎక్కడ అన్నారో నిరూపించాలని పోసానికి సత్యారెడ్డి సవాల్ విసిరారు.

షాక్ మీద షాక్: అంత మాటా? బాబుకు చిక్కులు తెచ్చిన లోకేష్, పోసాని ఆగ్రహం వెనుకషాక్ మీద షాక్: అంత మాటా? బాబుకు చిక్కులు తెచ్చిన లోకేష్, పోసాని ఆగ్రహం వెనుక

1998లోను పోసాని, గుణశేఖర్ ఇలాగే చేశారు

1998లోను పోసాని, గుణశేఖర్ ఇలాగే చేశారు

ఈ విషయానికి మంత్రి నారా లోకేష్‌కు ఏం సంబంధమో పోసాని చెప్పాలని సత్యారెడ్డి నిలదీశారు. 1998లో నంది అవార్డులు వచ్చినప్పుడు కూడా ఇలానే నంది అవార్డులు తప్పు అని ఇదే పోసాని గారు, గుణశేఖర్‌గారు మాట్లాడారని, దానికి సంబంధించి ఆనాడు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రకటనలు కూడా మీరు చూడవచ్చని అన్నారు. అప్పట్లోనే పోసాని నంది అవార్డులను రద్దు చేయాలని, నంది అవార్డులను కించపరిచేలా మాట్లాడారని సత్యారెడ్డి అన్నారు. అలాగే ఈ అవార్డులను ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక మతానికి అంటగట్టవద్దన్నారు.

లోకేష్ ఆధార్, ఓటర్ కార్డులు అన్నారా

లోకేష్ ఆధార్, ఓటర్ కార్డులు అన్నారా

అంతేకాదు అక్కడ ప్రత్యేక హోదా విషయంలో విమానంలో వచ్చి చలో అసెంబ్లీ అని, ధర్నాలు చేస్తామని, రాస్తారోకోలు చేస్తామని వచ్చే వాళ్లవల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాయని లోకేష్ మాట్లాడిన మాటలను, ఇక్కడ సినిమా పరిశ్రమతో ముడిపెట్టి ఆధార కార్డు ఉండాలా? ఓటర్ కార్డు ఉండాలా? ప్రశ్నించాలి అంటే.. అంటూ పోసానిగారు మాట్లాడడం ఎంతవరకు సరైనదో చెప్పాలని సత్యారెడ్డి నిలదీశారు.

మంచిని పక్కన పెట్టి ఇలాగా

మంచిని పక్కన పెట్టి ఇలాగా

అలాగే ఏపీ ప్రభుత్వం చేసే మంచి పనులను పక్కన పెట్టేసి పోసానిగారు ఇలా నంది అవార్డుల గురించి మాట్లాడడం, అలాగే లోకేష్ గురించి మాట్లాడిన మాటలు గాని, కులాలకు సంబంధించిన మాటలుగాని, ఒక పార్టీ ఎమ్మెల్సీ గురించి మాట్లాడిన మాటలు, బిఎన్ రెడ్డి అవార్డుపై బోయపాటిగారిని అన్నమాటలు, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళికి వచ్చిన అవార్డుల గురించి పోసాని మాట్లాడిన మాటలు అయన విజ్ఞతకే వదిలేస్తున్నామని సత్యారెడ్డి అన్నారు.

ఉపసంహరించుకొని ఫుల్ స్టాఫ్ పెట్టాలి

ఉపసంహరించుకొని ఫుల్ స్టాఫ్ పెట్టాలి

పోసాని నంది అవార్డుల విషయంలో మాట్లాడిన మాటలన్నీ ఉపసంహరించుకోవాలని సత్యారెడ్డి డిమాండ్ చేశారు. పోసాని మాట్లాడిన మాటలకు, ఏపీ ప్రజలు చాలా బాధపడుతున్నారని, సినిమా విషయంలో జరిగిన దాని గురించి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసి మాట్లాడడం సరికాదని, నంది అవార్డుల గురించి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. సినీ పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటి గురించి మాట్లాడాలన్నారు.

English summary
Producer and writer fires at actor and writer Posani Krishna Murali for his comments on AP Government and Minister Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X