ఆంధ్రప్రదేశ్‌లో యేటా ఆస్తి పన్ను పోటు: నారాయణ

సోమవారం నగరపాలక సంస్థ, ఉడా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు.
ప్రస్తుతం కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 2001లో తయారు చేసిన సాఫ్ట్‌వేర్ వాడకం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దాన్ని ఆధునీకరించి అన్ని శాఖలకు అనుసంధానించే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. మూడు నుంచి ఆరు నెలల్లో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.
కొత్త సాఫ్ట్‌వేర్‌తో సేవలలో పారదర్శకత, సామర్థ్యంలో 50 శాతం పెంపు ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పతకాల కింద నిధులు సమకూర్చుకునేందుకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వర్క్‌షాపులు నిర్వహిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు












Click it and Unblock the Notifications