విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి: కేసు నమోదు

యూనివర్శిటి ఇంజనీరింగ్ కళాశాలలో విజయనగరం పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని బిటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతోంది. ఈ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణకిశోర్ ఈ నెల 15వ తేదీన విద్యార్థిని ఫోన్‌కు మెసేజ్ పెట్టాడు.
16వ తేదీన డిపార్టుమెంట్‌కు ఒక్కదానివే రావాలని, వ్యక్తిగతంగా మాట్లాడాలనేది ఆ సందేశం. తాను సహ విద్యార్థినిని తీసుకుని వెళ్లానని, ఆమెను అతను బయటకు పంపించి, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేసింది.
కాగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ కిశోర్‌పై గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications