Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైలు కిందపడి ప్రొఫెసర్ ఆత్మహత్య, భార్య గొంతుకోశాడు

హైదరాబాద్: ఇక్‌ఫాయ్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. గురుప్రసాద్ మృతదేహాన్ని పోలీసులు ఆదివారం గుర్తించారు. అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో విభేదాలు, కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. ప్రతి వారం పిల్లలను తీసుకు వెళ్లేందుకు కోర్టు అతనికి అనుమతి ఇచ్చింది.

ఎప్పటిలాగే శనివారం కూడా అతను పిల్లలతో బయటకు వెళ్లాడు. అయితే, ఆ తర్వాత గురుప్రసాద్ సతీమణి పిల్లల కోసం మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించింది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న గురుప్రసాద్ తన సూసైడ్ నోట్లో పిల్లల విషయాన్ని ప్రస్తావించలేదని తెలుస్తోంది.

Professor commits suicide in Hyderabad

మద్యం మత్తులో భార్య గొంతు కోశాడు

విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఎండాడలో మత్స్యకారులు అధికంగా నివసించే ప్రాంతంలో ఓ వ్యక్తి ఫూటుగా మద్యం తాగి.. ఆ మద్యం మత్తులో భార్య గొంతును బ్లేడుతో కోశాడు. ఆమె కేకలు వేసింది. గమనించిన స్థానికులు అతనిని అడ్డుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.

అనంతపురంలోని దారుణం జరిగింది. రాంనగర్లో నివాసముండే ఓ దంపతులు రైల్వే ట్రాక్ పైన గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో భర్త భార్య గొంతు నులిమి హత్య చేసి, అనంతరం ఆమె మృతదేహాన్ని రైల్వే ట్రాక్ పైన పడేసి, అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+