వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక ఆస్తి పన్ను మోత.. ఏపీలో పెంపు.. త్వరలో ఉత్తర్వులు జారీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గం కొలువుదీరే హడావిడి ఉంది. మరోవైపు కరెంటో కోతలు.. పరిశ్రమలకు పవర్ హాలీడే ఇస్తున్నారు. మరోవైపు ఆస్తి పన్ను కూడా పెంచారు. దీంతో వినియోగదారుల మీద భార పడింది. పెట్రో మంట.. గ్యాస్ బాదుడు... నిత్యావసర సరుకులు కూడా పెరగడంతో ఇప్పటికే జనం అల్లాడిపోతున్నారు. దానికితోడు ఆస్తి పన్ను బాదుతున్నారు. దీంతో వినియోగదారులు లబోదిబో మంటున్నారు. పన్ను బాదుడు ఏంటీ అని వాపోతున్నారు.

ఛార్జీల మోత..

ఛార్జీల మోత..

ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రజలపై మరో పిడుగు వేసింది. ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచింది. పట్టణాల్లో భారీగా ఆస్తిపన్ను పెరిగింది. ప్రజలపై రూ. 214 కోట్ల భారం పడింది. పట్టణాల్లో మరో 15 శాతం పెంచగా, రెండు సంవత్సరాల్లో 32.24 శాతం పెరిగినట్లైంది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

కరెంట్ కట్

కరెంట్ కట్

కరెంట్‌ బిల్లు కట్టకపోతే కరెంట్‌ కట్‌ చేయడం.. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేయడం.. ఇలా పలు రకాల పన్నుల విషయంలో.. అధికారులు ప్రజలపై తీసుకునే చర్యలు సాధారణంగా మారిపోయాయి. చెత్త పన్ను, ఆస్తి పన్ను పేరుతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు వల్ల పన్నులు వసూలు చేయాలని అధికారులు టార్గెట్ నిర్దేశించుకున్నారు. అందుకోసమే ఇష్టరీతిన వ్యవహారిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల కొన్ని ఘటనలు వార్తల్లోకి కూడా వచ్చాయి.

వస్తువులు జప్తు

వస్తువులు జప్తు

పన్నులు కట్టకపోతే ఇంట్లోని వస్తువులు జప్తు చేస్తామనే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కొందరివీ చేశారు కూడా.. పన్నుల వసూలు కోసం తూర్పు గోదావరి జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలు విమర్శలకు దారి తీశాయి. ప్రస్తుతం పెరిగిన ఆస్తి పన్నుపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఎప్పుడూ జనంపై ఒక పన్ను ఉంటుందని అంటున్నారు. తమను ఇబ్బందికి గురిచేయడం సరికాదని అంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చే హామీలు వేరు.. అమలు చేసే విధానాలు వేరు అని అంటున్నారు. దీంతో వినియోగదారులకు సమస్య తప్పడం లేదని వాపోతున్నారు.

English summary
property tax to increase in andhra pradesh state. government order may release in soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X