వ్యభిచారం: ఢిల్లీ యువతి సహా ముగ్గురి అరెస్టు

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత రాత్రి ఈ ఘటన జరగడంతో వెంటనే కుటుంబసభ్యులు బాధితురాలిని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. భారత్ ఫార్మసీ కాలేజీలో యాజమాన్యం ఫీజు కట్టాలంటూ విద్యార్థులను వేధింపులకు గురి చేశారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో ఫీజు కట్టని విద్యార్థులను ఎక్స్‌టర్నర్ ల్యాబ్ పరీక్షకు అనుమతించేది లేదని ప్రిన్సిపాల్ హెచ్చరించారు. దీంతో మనస్థాపం చెందిన బీఫార్మసీ విద్యార్థిని కవిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
రిజిస్ట్రార్ అరెస్టు
కరీంనగర్ జిల్లా రిజిస్టార్ రమణరావును గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున డెయిరీ ఆస్తుల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు రమణరావుపై ఆరోణలు ఉన్నాయి. ఈ క్రమంలో హన్మకొండలో రమణరావును హుజూరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications