మద్యం షాపులకు వ్యతిరేకంగా ఆందోళనలు..!!
ఏపీలో కొత్త లిక్కర్ షాపులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన లిక్కర్ పాలసీకి అనుగుణంగా అమ్మకాలు జరుగుతున్నాయి. తిరిగి బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి వచ్చింది. మద్యం షాపులు దక్కించుకోవటానికి భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు షాపులు దక్కించుకున్న వారు ప్రారంభించే వేళ పలు ప్రాంతాల్లో నిరసనలు మొదలయ్యాయి. తమ ప్రాంతంలో ఈ మద్యం షాపులు వద్దంటూ స్థానికులు నిరసనకు దిగుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు మొదలయ్యాయి. తిరుపతి, తాడేపల్లి, కర్నూలు జిల్లా ఆదోని వంటి ప్రాంతాల్లో తమ ప్రాంతంలో దుకాణాలు వద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. అధికారులు ఆ షాపులను అక్కడ నుంచి తెలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని ఎక్సైజ్ కార్యాలయం దగ్గర కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని ప్రభాకర్ థియేటర్ వద్ద ఉన్న శ్రీ శంభూలింగేశ్వర దేవాలయం వద్ద తెరిచిన మద్యం దుకాణాన్ని మూసివేయాలంటూ ఎక్సైజ్ కార్యాలయం ముందు కాలనీ వాసులు ధర్నా చేశారు.

స్థానికులు ఆ తరువాత ఎక్సైజ్ సీఐ సైదులుకు ఫిర్యాదు చేశారు. మద్యం దుకాణం వేరే ప్రాంతానికి మారుస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆదోళనకారులు ధర్నాను విరమించారు. గుడికి ఎదురుగా మహారాజా వైన్ షాప్ను తొలగించాలని స్థానికులు ఆందోళనకు దిగారు. శివ మాల దారుల ఎదుట సారాకొట్టు నిర్వహించడం దారుణమని ఆందోళనకారులు వాపోయారు. ఇక..మద్యం దుకాణాల ఖరారు.. నిర్వహణలో అధికార పార్టీ నేతల ప్రమేయం పైన ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఎవరూ మద్యం వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. అయినా.. వారి పైన ఇంకా ఆరోపణలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications