Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో దూకుడు పెంచుతున్న బీజేపీ..! జగన్ సర్కార్ వేధింపులపై పల్నాడులో ఈ నెల 16న నిరసన

Recommended Video

    జగన్ సర్కార్ వేధింపులపై ఈ నెల 16న బీజేపీ నిరసన|Kanna Has Made Interesting Comments On YS Jagan & YCP

    ఏపీలో బీజేపీ జగన్ సర్కార్ పాలనపై విరుచుకు పడుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడని మండిపడుతుంది. వై ఎస్ జగన్ సర్కార్ వేధింపులపై ఈ నెల 16న పల్నాడులో నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ పాలనపై ప్రజలు అసహనంతో ఉన్నారని , విపరీతంగా గ్రామ స్థాయి నుండి ప్రజలను అణచివేసే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అందుకే ఈ నెల 16న పల్నాడులో నిరసన దీక్ష చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

    జగన్ పాలనపై నిప్పులు చెరిగిన కన్నా లక్ష్మీ నారాయణ

    జగన్ పాలనపై నిప్పులు చెరిగిన కన్నా లక్ష్మీ నారాయణ

    రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడుతున్నారు బీజేపీ నేతలు . వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ పాలన దారుణంగా ఉందని కన్నా మండిపడ్డారు . ఇక జగన్ మాటలకు చేతలకు పొంతన లేదని చెప్పిన ఆయన అవినీతి గురించి మాట్లాడటం తప్ప జగన్ చేసింది ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు . గ్రామ స్థాయి నుండే ప్రజలను , తమ పార్టీకి అనుకూలంగా లేని వాళ్ళను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో వేధింపులకు పాల్పడుతున్నట్టుగా ఆయన ఆరోపించారు. ఇక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని , అన్ని టెండర్లు రద్దు చేస్తూ జగన్ రాష్ట్రానికి నష్టం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

    అమరావతి సమావేశంలో జగన్ సర్కార్ పై కన్నా వ్యాఖ్యలు

    అమరావతి సమావేశంలో జగన్ సర్కార్ పై కన్నా వ్యాఖ్యలు

    అమరావతిలో జరిగిన బీజేపీ పదాదికారుల సమావేశంలో మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ ప్రభుత్వం కొంత కాలమైనా ఆగింది, కానీ, వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఎగిరి పడుతుందని ఆయన మండిపడ్డారు. వైసీపీ నాయకుల్లో కనీసం ఓపిక కూడ లేదని ఆయన విమర్శించారు. .గ్రామస్థాయి నుండే ఉద్యోగాల తీసివేత పోలీసు కేసుల నమోదు చేయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను జగన్ తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నరవేర్చకపోగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు కన్నా .

    జగన్ కు ఆత్రం, ఆవేశం రెండూ ఎక్కువేనని కన్నా వ్యంగ్యాస్త్రాలు

    జగన్ కు ఆత్రం, ఆవేశం రెండూ ఎక్కువేనని కన్నా వ్యంగ్యాస్త్రాలు

    జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకొంటున్నారని విమర్శలు గుప్పించారు కన్నా లక్ష్మీనారాయణ . జగన్ కు ఆత్రం, ఆవేశం రెండూ ఎక్కువేనని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు . ఇక ప్రస్తుత ప్రభుత్వంలో వేగం లేదన్న ఆయన వైఎస్ జగన్ సర్కార్ వేధింపులకు నిరసనగా ఈ నెల 16వ తేదీన పల్నాడులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టుగా కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. మొత్తానికి బీజేపీ కూడా వైసీపీ అధినేత జగన్ పై, జగన్ సర్కార్ పై యుద్ధ భేరి మోగించింది. ఆందోళన బాట పడతామని తేల్చి చెప్పింది. వైఖరి మార్చుకోవాలని సూచించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+