ఎపికి పాకిన రోహిత్ ఆత్మహత్య సెగలు: ఎంపి రవీంద్రబాబు డిమాండ్

గుంటూరు/ రాజమండ్రి: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య సెగలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పాకాయి. రోహిత్ ఆత్మహత్య, సంబంధిత పరిణామాలు గుంటూరులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

రోహిత్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు శంకర్‌విలాస్ సెంటర్‌లో ఎన్‌ఎస్‌యూఐ రాస్తారోకో నిర్వహించింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసు బలగాలను మొహరించారు. రోహిత్ గుంటూరుకు చెందినవాడనే విషయం తెలిసిందే.

Also Read: Stories about rohit suicide

Protests in AP on Dalith student Rohith's suicide

హెచ్‌‌సీయూ విద్యార్థి రోహిత్‌ కుటుంబసభ్యులకు వెంటనే పరిహారం ఇవ్వాలని పార్లమెంటు సభ్యుడు రవీంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రోహిత్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. మృతికి కారణమైన వారిపై 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలని రవీంద్రబాబు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+