వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు తెలుగురాష్ట్రాల్లో ఆందోళనలు .. ఏపీలో టీడీపీ .. తెలంగాణాలో కాంగ్రెస్ నిరసనలు

|
Google Oneindia TeluguNews

రెండు తెలుగు రాష్ట్రాలలో నేడు ఆందోళనల పర్వం కొనసాగనుంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు నిరసనలు నిర్వహించనున్నాయి. అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణాలోనూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తనున్నాయి.

కరోనా విషయంలో హైదరాబాద్ కంటే ఏపీ సేఫ్ జోనా ? ఏపీ తెలంగాణా బోర్డర్ లో ట్రాఫిక్ రద్దీతో చర్చకరోనా విషయంలో హైదరాబాద్ కంటే ఏపీ సేఫ్ జోనా ? ఏపీ తెలంగాణా బోర్డర్ లో ట్రాఫిక్ రద్దీతో చర్చ

ఏపీ ప్రభుత్వం రేపు వైయస్సార్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గతంలో టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్ళు లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై తెలుగుదేశం పార్టీ నేడు ఆందోళనకు దిగుతున్నారు. ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు తెలుగుదేశంపార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆందోళనలు కొనసాగనున్నాయి.

Recommended Video

Pawan Kalyan Motive On Issue Based Politics Highlighted Again || Oneindia Telugu
 Protests in Telugu states today, TDP in AP, Congress protests in Telangana


మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ నిరసనల బాట పట్టింది. అసలే ప్రజలు కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే కరెంటు బిల్లులు విపరీతంగా రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విద్యుత్ బిల్లుల రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం లో భాగంగా నేడు విద్యుత్ బిల్లుల రద్దు కోసం కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేయనుంది. ఇప్పటికే చాలా రోజులుగా కరెంట్ బిల్లుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు .

English summary
In the two Telugu states, the agitations will continue today. TDP in Andhra Pradesh , Congress Party in telangana will hold protests against the government policies. There will be protests across the state for the distribution of houses allotted during the TDP period in the AP and the cancellation of the current bills in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X