ఛాతీపై తెలంగాణ స్లోగన్: లేడీ టీచర్ల డ్యాన్స్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంటులో వెంటనే బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల సంఘం (పిఆర్‌టియు) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద యెత్తున పాల్గొన్నారు.
పిఆర్‌టియు నాయకుడు మోహన్ రెడ్డి ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. ఉపాధ్యాయులు, లేడీ టీచర్లు తెలంగాణ బ్యానర్లను ప్రదర్శించారు. తెలంగాణ నినాదాలు చేశారు. పార్లమెంటులో వెంటనే తెలంగాణ బిల్లును ప్రతిపాదించాలని వారు డిమాండ్ చేశారు.
హైదరాబాదుతో కూడిన పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ గేయాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల నుంచి ఉపాధ్యాయులు హైదరాబాద్ తరలి వచ్చారు.

ఛాతీపై తెలంగాణ స్లోగన్
అర్థ నగ్నంగా ఛాతీపై తెలంగాణ నినాదాన్ని రాసుకుని ఓ ఉపాధ్యాయుడు ఇలా ధర్నాలో పాల్గొన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ నినాదాలు
హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద పిఆర్‌టియు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్న ఉపాధ్యాయులు

మహిళా టీచర్లు కూడా..
పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డును ప్రదర్సిస్తూ మహిళా టీచర్ ఇలా...

మోహన్ రెడ్డి మాట్లాడుతూ..
ధర్నా కార్యక్రమంలో పిఆర్‌టియు నేత మోహన్ రెడ్డి తెలంగాణపై ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలా కనపించారు.

డ్యాన్స్ చేస్తూ..
తెలంగాణ ఏర్పాటు కాబోతుందనే ఆనందం కావచ్చు... తెలంగాణ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఇలా మహిళా టీచర్...

మహిళా టీచర్ల హల్‌చల్..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో వెంటనే బిల్లును ప్రతిపాదించాలని కోరుతూ హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో హల్‌చల్ చేస్తూ మహిళలు ఇలా చిందులు వేశారు.












Click it and Unblock the Notifications