ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎవరి పట్టు ఎంత, వారికి డేంజర్ బెల్స్ - ఇదీ లెక్క..!!

ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ మధ్య ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు అవుతున్న వేళ ఈ ఎన్నికలతో ప్రజలు తమతోనే ఉన్నారని నిరూపించోవాలని భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు వైసీపీ సైతం ఈ ఎన్నికల కోసం ఇప్పటికే సమాయత్తం కావాలని నిర్ణయించింది. ఇదే సమయంలో క్షేత్ర స్థాయి నివేదికలు మాత్రం ఆసక్తిగా మారుతున్నాయి.

ఏపీలో అక్టోబర్ నెలాఖరు నాటికి స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం నుంచి ఈ ఎన్నికలు పూర్తి చేస్తే పెద్ద మొత్తంలో నిధులు రాష్ట్రానికి దక్కనున్నాయి. దీంతో ఈ ఎన్నికల కోసం కూటమి పార్టీల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. సీట్ల షేరింగ్ పైన మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యాయి. తమకు పట్టు ఉన్న ప్రాంతంలో పోటీ చేస్తామని జనసేన చెబుతోంది. దీంతో.. 2024 ఎన్నికల తరహాలో కాకుండా జనసేన, బీజేపీ మరింతగా ఈ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు శాతం పెరిగే అవకాశం ఉంది. అటు మాజీ సీఎం జగన్ రేపు (మంగళ వారం) 175 నియోజకవర్గాల ఇంఛార్జ్ లతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. స్థానిక ఎన్నికల్లో ప్రతీ చోట పార్టీ అభ్యర్ది ఖచ్చితంగా పోటీలో ఉండాల్సిందేనని నిర్దేశించారు.

 అల్ప పీడనం ఎఫెక్ట్, ఈ జిల్లాల్లో ఇక భారీ వర్షాలు- తాజా హెచ్చరిక..!!
అల్ప పీడనం ఎఫెక్ట్, ఈ జిల్లాల్లో ఇక భారీ వర్షాలు- తాజా హెచ్చరిక..!!
psephologists-predicts-andhra-pradesh-local-body-election-results-in-urban-and-rural-areas-here-the

ఎవరి బలం ఎంత

ఈ సమయంలో హోరా హోరీగా మారుతున్న ఈ ఎన్నికల వేళ ప్రముఖ సెఫాలజిస్టులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నికల షెడ్యూల్.. పొత్తులు ఖరారు కాకపోవటంతో క్షేత్ర స్థాయిలో ఎవరికి ఎక్కడ అనుకూలం ఉందనే సంకేతాలు ఇస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ సెఫాలజిస్ట్ ప్రవీణ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అందులో .." కార్పొరేషన్లలో అధికార టీడీపీ గట్టి పట్టు! పంచాయతీల్లో ఊహించని విధంగా పుంజుకున్న వైసీపీ.. మున్సిపాలిటీలు మిక్స్ డ్ రిజల్ట్స్.. రాయలసీమలో కూటమి ప్రత్యేక దృష్టి అవసరం .. Ex : తిరుపతి మేయర్ టీడీపీ - బీసీ యాదవ.." అంటూ పోస్టు చేసారు. దీని ద్వారా అర్బన్ లో కూటమి.. రూరల్ లో వైసీపీ పట్టు కనినిపిస్తున్నట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ అంచనాల వేళ.. స్థానిక ఎన్నికలు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న కూటమి.. వైసీపీ మధ్య తుది ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+