కర్నూలు చర్చిలో సైకో కలకలం: డాక్టర్ హిమబిందుపై సుత్తితో దాడి
కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లాలో హిమబిందు అనే డాక్టర్ చర్చిలో ప్రార్థనలు చేస్తుండగా సైకో దాడికి పాల్పడ్డాడు. అతను సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటన కర్నూలులోని సిఎస్ఐ చర్చిలో ఆదివారం ఉదయం జరిగింది. 45 ఏళ్ల హిమబిందు చర్చిలో ప్రార్థనలు చేస్తోంది.
ఈ సమయంలో ఓ ఉన్మాది సుత్తితో ఆమెపైన దాడికి పాల్పడ్డాడు. ఆమె అక్కడే కూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి, సైకో గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నకిలీ కుల ధృవపత్రాలతో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన డేవిడ్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందాడు. అధికారుల విచారణ జరిపించడంతో అది నిజమని తేలింది. దీంతో ఆదివారం అతనిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications