Puneeth Rajkumar: టాలీవుడ్‌తో స్వీట్ మెమోరీస్- పాటలు.. రీమేక్‌లు ఎవర్‌గ్రీన్..!!

యావత్ సినీ ఇండస్ట్రీని పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం షాక్ కు గురి చేసింది. 46 ఏళ్ల వయసులో కన్నడ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా వెలుగొందుతూ ఆయన గుండెపోటుకు గురై మరణించారు. ఆయన మరణ వార్తతో కోట్లాది మంది అభిమానులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసుకునేందుకు బెంగళూరుకు తరలివస్తున్నారు. అతి పిన్న వయసులోనే ఇలాంటి ఘోరం జరగడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కూడా స్వయంగా ఆస్పత్రికి వచ్చి నివాళులు అర్పించారు.

తెలుగు నాట పునీత్ మరణంతో షాక్

తెలుగు నాట పునీత్ మరణంతో షాక్

ఆ మరణ వార్త తెలుగు సినీ ఇండస్ట్రీని ఆవేదనలోకి నెట్టేసింది. ఆయన మరణం పైన చిరంజీవి..పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు. మహేష్ బాబు షాకింగ్ న్యూస్ గా పేర్కొన్నారు. ఇక, పునీత్ రాజ్ కుమార్ తో తెలుగు సినీ ఇండస్ట్రీకి మంచి సంబంధాలు ఉండేవి. పునీత్ నటించిన తొలి చిత్రంను పూరీ జగన్నాధ్ తెలుగులో ఇడియట్ గా రీమేక్ చేసారు. మహేష్ బాబు తెలుగులో నటించిన ఒక్కడు మూవీని పునీత్ హీరోగా కన్నడంలో అజయ్ గా రీమేక్ చేసారు.

తెలుగు సినీ ప్రముఖులతో సత్సంబంధాలు

తెలుగు సినీ ప్రముఖులతో సత్సంబంధాలు


పునీత్ రాజ్ కుమార్ తండ్రి..కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్‌‌తో నాడు ఎన్టీఆర్ కు ఎటువంటి సంబంధాలు ఉండేవో..ఆ తరువాత పునీత్ - జూనియర్ ఎన్టీఆర్ మధ్య అటువంటి సత్సంబంధాలే కొనసాగాయి. జూనియర్ ఎన్టీఆర్ - సునీత క్లోజ్ ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ నటనతో పాటుగా పాటల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నాన్నకు ప్రేమతో సినిమాలో..ఫాలో ఫాలో ఫాలో మీ అంటూ పాటను పాడారు. అదే విధంగా యమదొంగ సినిమాలో ఓలమ్మీ తిక్కరేగిందా, అదే విధంగా..రభసలో రాకాసి.. రాకాసి పాటలను ఎన్టీఆర్ పాడారు.

పునీత్ కోసం జూ ఎన్టీఆర్ పాట.. సూపర్ హిట్

పునీత్ కోసం జూ ఎన్టీఆర్ పాట.. సూపర్ హిట్

ఇక, ఎన్టీఆర్ పాటలు పాటలను ఇష్టపడే పునీత్ రాజ్ కుమార్ తన సినిమాలో ఓ పాటను పాడాలని స్వయంగా కోరారు. దీంతో ఎన్టీఆర్ ఓకే చెప్పేశారు. చక్రవ్యూహ అనే యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ సినిమాలో పాడిన గెలియా..గెలియా పాట సూపర్ హిట్ అయింది. సినిమాలో ఆ పాట అభిమానులను ఎంతగానో అలరించింది. సినిమా సూపర్ హిట్ అవడంలో ఆ పాట పాత్ర కూడా ఎంతో ఉంది. తరువాత కర్ణాటకలో అనేక మంది పునీత్ ఫ్యాన్స్ కు ఆ పాటే రింగ్ టోన్ గా మారిపోయింది.

మెగాస్టార్..బాలయ్య....మహేష్ బాబు ఆవేదన

మెగాస్టార్..బాలయ్య....మహేష్ బాబు ఆవేదన

ఇక, రాజ్ కుమార్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకున్నారు. చిరంజీవి తన ట్వీట్ లో ...పునీత్ నాకు అత్యంత ఆప్తుడు, వారి కుటుంబంలోని వారంతా నాకు కావాల్సిన వారు. ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా నన్ను పునీత్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణ వార్త తెలియగానే నా నోట మాట కూడా రాలేదు. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను..'' అని పేర్కొన్నారు. ఇక, పవన్ సైతం పునీత్ మరణం పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. రాజకీయ నేతలు..సీనీ హీరోలు..పరిశ్రమ ప్రముఖులు ఒక్క సారిగా పునీత్ మరణంతో షాక్ అయ్యారు. చిన్న వయసులోనే మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+